Wednesday 6 November 2013

ప్రణబ్‌కు కర్జన్ ‘పాఠం’! ABK

ప్రణబ్‌కు కర్జన్ ‘పాఠం’!

Sakshi | Updated: November 06, 2013 11:09 (IST)
ప్రణబ్‌కు కర్జన్ ‘పాఠం’!
భాషా ప్రయుక్త రాష్ట్రాల సహకారంతో ప్రథమ పౌరుడిగా ఎన్నికైన  ప్రణబ్ ముఖర్జీ అప్రమత్తంగా ఉండి తెలుగు జాతిని విభజించాలన్న  కాంగ్రెస్ అధిష్టానం, కుంభకోణాలతో పరువు కోల్పోయిన కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను బిల్లు రూపంలో తన ముందుకు వస్తే తిరస్కరించగలరన్న విశ్వాసంతో తెలుగు జాతంతా ఎదురు చూస్తున్నది!

 ‘దేశంలో రాష్ట్రాల పాలనా సరి హద్దుల్ని హేతుబద్ధమైన పునా దులపైన పునర్విభజించాలన్న డిమాండ్ ఇప్పటికాదు, చాలా కాలంగా ఉన్నదే. ఆ మాటకొస్తే అది నలభై ఏళ్ల క్రితమే (1915- 1920) తలెత్తింది. రాష్ట్రాల పున ర్వ్యవస్థీకరణ సూత్రాన్ని 1920 లోనే జాతీయ కాంగ్రెస్ ఆమో దించింది. ఆ పిమ్మట కొంత కాలానికే కాంగ్రెస్ పాలన కింద రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బ్రిటిష్ పాలనలో ఏర్పడిన రాష్ట్రాలకు హేతుబద్ధమైన పునాదులు లేవు. బ్రిటిష్ వాళ్లు సొంత లాభ లబ్ధి సూత్రాలను బేరీజు వేసుకుని వాటిని ఏర్పరిచారు. ఎందుకని? భారతదేశంపైన తమ పట్టు సడలిపోకుండా చూసుకోవడానికే. బ్రిటిష్ వాళ్లు రాష్ట్రాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో సాంస్కృతిక, ఆర్థిక తదితర అంశాలపట్ల శ్రద్ధ వహించలేదు. కాని, భాషా సంస్కృతుల పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో కాంగ్రెస్ పదే పదే విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ వచ్చింది. తద్వారా ప్రజలూ, పాలనా వ్యవస్థా పరస్పరం సన్నిహితం కాగలుగుతారనీ, విద్యా విషయాలలో సానుకూలమైన సౌకర్యాల కల్పనకు అవకాశం కలుగుతుందనీ పార్టీ విశ్వసించింది. అలాగే వర్తక, వ్యాపారాది విషయాలలో అభ్యున్నతికి పరిపూర్ణ మైన అవకాశాలు కలుగుతాయనీ కూడా కాంగ్రెస్ విశ్వ సిస్తూవచ్చింది’.
 (పండిట్ గోవింద వల్లభపంత్: కేంద్ర హోంమంత్రి హోదాలో 1955, డిసెంబర్ 14న లోక్‌సభలో రాష్ట్రాల పున ర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడుతూ చేసిన ప్రకటన.)

 ఏ భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలోని తొలి స్వతంత్ర ప్రభుత్వం కనుసన్నలలో మూడు ప్రాంతాల తెలుగువారి సొంతగూడుగా విశాలాంధ్ర ఏర్పడిందో, ఆ కాంగ్రెస్ వారే స్వార్థప్రయోజనాల కోసం తమ చేతుల ద్వారా ఆ తొలి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని చీల్చడానికి పావు లు కదుపుతున్నారు. అదికూడా ప్రజల అనుమతి లేకుం డా, వారెన్నుకున్న శాసనసభతో నిమిత్తం లేకుండానే.

 అలాంటి కష్టాలు ఇంకానా!
 రాష్ట్ర రాజధానిలో ఒకరోజు పర్యటించి వెళ్లిన గౌరవ రాష్ట్ర పతి, బెంగాల్ సుపుత్రులలో ఒకరు ప్రణబ్ ముఖర్జీకి ఈ విషయాలన్నీ తెలుసు. లార్డ్ కర్జన్ 1905లో చేసిన బెం గాల్ విభజనతో యావత్తు బెంగాలీలు ఎంత క్షోభ అనుభ వించారో కూడా బెంగాలీబాబు ప్రణబ్‌కు తెలియనిది కాదు! అటు బ్రిటిష్ సామ్రాజ్యపాలన కింద సీమాం ధ్రులు నలిగిపోయిన సంగతి, ఇటు నిజాం నిరంకుశ రాచ రిక వ్యవస్థలకు వ్యతిరేకంగా మహోన్నత రైతాంగ సాయు ధపోరాటం సాగిన చరిత్ర కూడా ప్రణబ్‌కు గుర్తుండే ఉం టుంది. అలా రెండు రకాల పరాయి పాలనల్లో మగ్గుతూ చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదరై ఉన్న తెలుగుజాతి తన మూలాలు తాను తెలుసుకుని తిరగబడిన తర్వాతనే మొత్తం తెలుగుజాతి ఆంధ్రప్రదేశ్ అనే సువిశాల రాష్ట్ర ఛత్రఛాయల్లో, ఉన్న పెట్టుబడిదారీ - భూస్వామ్య వ్యవస్థ పరిమితులలోనే అయినా, శరవేగాన అభ్యున్నతిని నమో దు చేసుకుంటున్న విషయమూ ఆయనకు తెలియకపోదు. ఈ సౌభాగ్యాన్ని ఇనుమడింపజేసేందుకు దివంగత ప్రధా ని ఇందిరా గాంధీ 371(డి) అనే ప్రత్యేక అధికరణతో ఏ ఇతర రాష్ట్రానికీ లేని ప్రత్యేక రక్షణలు కల్పించిన సంగతీ ప్రణబ్‌కు గుర్తుండే ఉండాలి!

 ఇది నల్లదొరల వ్యూహం
 ఇదే సందర్భంగా దేశీయ, పరదేశీయ శక్తులతో లాలూచీ పడి, సామాన్యుల, కష్టజీవుల, ఆయా ప్రాంతాల మూల్గు లనూ పీల్చివేసి బలిసిన విద్రోహుల గురించీ మరచి పోలేం! స్థానిక విద్రోహుల సాయం లేకుండా లార్డ్ కర్జన్ బంగారు బంగ్లాను (టాగూర్ ‘సోనార్ బంగా’్ల) నిట్ట నిలువునా చీల్చలేదనీ ప్రణబ్‌కు తెలుసు. కర్జన్ ఎలాంటి కుట్రలు, కూహకాలతో బెంగాల్‌ను విభజించి, ఎలా కల్లో లంలోకి నెట్టాడో ప్రణబ్‌కు తెలుసు! ‘ప్లాసీ’ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను విభజించి పాలించే కుటిల నీతితోనూ, ఆ నవాబు సేనాపతి మీర్జాఫర్‌ను ఎలా ప్రలోభపెటి ్ట కంపెనీ వాళ్లు ప్లాసీ దగ్గర గెలిచినదీ చరిత్ర విద్యార్థి అయిన ప్రణబ్‌కు తెలుసు! అదే ‘విభజించి- పాలించే’ సూత్రాన్ని అందిపుచ్చుకున్న నేటి కాంగ్రెస్ ఎన్నికల ప్రయోజనాల కోసం భాషా సాంస్కృతిక సంప దతో వేల సంవత్సరాల నుంచీ దీపిస్తున్న తెలుగుజాతిని రెండు ముక్కలుగా చీల్చడానికి సమాయత్తమవుతున్న వేళ ఇది. భాషా ప్రయుక్త రాష్ట్రాల సహకారంతో ప్రథమ పౌరు డిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ అప్రమత్తంగా ఉండి తెలుగు జాతిని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కుంభకోణా లతో పరువు కోల్పోయిన కేంద్ర మంత్రి మండలి నిర్ణయా లను బిల్లు రూపంలో తన ముందుకు వస్తే తిరస్కరించగ లరన్న విశ్వాసంతో తెలుగు జాతంతా ఎదురు చూస్తు న్నది! దేశ విభజన తరువాత 500కు పైగా స్వదేశ సంస్థా నాలను భారత యూనియన్‌లో విలీనం చేయడానికి ఉద్దేశించిన, అందుకు మొరాయించే (నిజాం, జూనాగడ్, తిరువాన్కూర్ వగైరా విలీనాన్ని ప్రతిఘటించాయి) సం స్థానాలకు ముగుదాడు వేయడానికి ఉద్దేశించిన రాజ్యాం గం 3వ అధికరణ పరిధుల్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దాటిపోయింది. ఈ సత్యాన్ని 1967లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో కేంద్రానికి ఒక హెచ్చరికగా వెల్లడించిన సంగతినీ ప్రణబ్ గుర్తించాలి.

 రాష్ట్రపతికి విన్నపం
 అంతకుముందు తొలి రాజ్యాంగ అధికరణ (3)కు మినహా యింపు నిబంధన (ప్రొవిజో) పేరిట వచ్చిన ప్రత్యేక అం శంలో, ఏదైనా బిల్లును సదరు బిల్లు వల్ల నష్టపోయే రాష్ట్రం లేదా రాష్ట్రాల శాసనసభల నుంచి రాష్ట్రపతి నిష్కర్షగా, నిశ్చితమైన విధంగా నిజాన్ని తెలుసుకోవడం కోసం (ఎసర్టైన్డ్) విధిగా నివేదించాలని ఉంది. అంటే కేవల అభి ప్రాయం కాదు, చర్చించి, ఓటింగ్ ద్వారానే ‘నిశ్చితాభి ప్రాయ’ ప్రకటన ఉండటమే ‘ఎసర్డైన్’ చేసుకోవడమంటే! కాని అ స్పష్టతను లేకుండా చేసేందుకు ‘ఎసర్డైన్’ అన్న ప్రొవిజన్‌లోని పదాన్ని కాస్తా 1955 నాటి రాజ్యాంగ సవ రణ ద్వారా తొలగించేసి, దాని స్థానంలో బిల్లును శాసన సభ కేవల అభిప్రాయం కోసం ప్రస్తావన మాత్రంగా (రిఫర్) రిఫర్ చేయాలని చేర్చారు! ఈ ‘బుద్ధి’ ఎక్కడ నుం చి అరువుగా వచ్చింది? 1935 నాటి వలస పాలనా ప్రభు త్వ చట్టాన్ని వెతికి మరీ ‘విభజన’ సూత్రాన్ని అప్పనంగా కాంగ్రెస్ పాలకులు అందుకోవడం వల్ల! కాని జమ్మూ- కాశ్మీర్ శాసనసభకు మాత్రం మన పాలకులు ఈ అడ్డంకి పెట్టలేదు సుమా! ఒక జాతిని, దాని రాష్ట్రాన్నీ బలవంతం గా చీల్చే హక్కులేదని బహిరంగంగా కాకపోయినా, నేర చరితులైన లెజిస్లేటర్లను శిక్షించాలన్న సుప్రీం తీర్పును ఉల్లంఘిస్తూ కేంద్ర కేబినెట్ తెచ్చిన ఆర్డినెన్స్‌పై ప్రదర్శిం చిన ‘అసహనం’... తద్వారా ఆనోట ఆనోటా పాకిపోయి ఆర్డినెన్స్ ఉపసంహరణకు దారిచేసేలా తోడ్పడినట్టు - సమైక్య రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే నిర్ణయాన్ని కూడా రాష్ర్ట పతి పూర్వపక్షం చేయవచ్చు. విభజన వల్ల నాటి బెంగాల్ అనుభవించిన అశాంతి తెలుగు జాతికి ఎదురుకాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్రపతికి ఉంది. రాష్ట్ర శాసనసభ ను వాగుడు ‘పిట్టల’ కేంద్రంగా మిగల్చకూడదు.

 ఆ జాడను చూడండి!
 అంతేకాదు, దశాబ్దాలుగా బెంగాలీ సాహిత్య, సంస్కృతు ల ప్రభావంలో తెలుగు జాతి ఈదులాడిన ఘన చరిత్ర ఉంది. రవీంద్రుడి ‘జనగణమన’ గీతానికి స్వరకల్పన జరి గిన స్వర్ణభూమి ఈ తెలుగునేల. రవీంద్రుడ్ని మత్తిల్ల చేసిన మహా వైణికుడైన సంగమేశ్వరశాస్త్రి పుట్టిన గడ్డ ఇది. శరత్‌చంద్రుడి రచనలను తెలుగు వాడి సాహిత్యంగానే కళ్ల కద్దుకుని తరించిన కర్మభూమి! కాంగ్రెస్ విశిష్ట అధ్యక్షు రాలు సరోజినీదేవి తెలుగు గోవిందరాజుల నాయుడిని వీరేశలింగం పంతుల పౌరోహిత్యంలో ఆశీస్సులతో వివా హమాడిన చోటు ఇదే.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్‌రాయ్‌ల సరసనే నిలబడి యావద్భారత సం స్కరణోద్యమాలనే ముందుకు నడిపించిన మహనీయుడు వీరేశలింగం పుట్టిన పుణ్యభూమి ఇది! బెంగాల్ నుంచి వెలువడిన ‘రాస్ అండ్ రయ్యత్’ పత్రికా సంపాదకులతో సమ ఉజ్జీగా భావనా స్రవంతిని పంచుకున్న వాడు గుర జాడ! స్త్రీ విమోచనోద్యమానికి స్త్రీ విద్యకూ బెంగాలీలకు చేదోడువాదోడుగా నిలిచిన మహనీయులలో పండిత సుర వరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, దాశరథి సోదరులు, చలం, శ్రీశ్రీ, కాళోజీ, కొడవటిగంటి వగైరా లను ఆదరించిన భూమి ఇది. శాంతినికేతన్ స్నాతకులు బెజవాడ గోపాలరెడ్డి, సంజీవదేవ్, చీమకుర్తి శేషగిరిరావు, అడివి బాపిరాజు లాంటి రచయితలను, చిత్రకారులను ప్రాంతీయ సరిహద్దులెరుగని సువిశాల మనస్కులను కన్న తల్లి తెలుగునేల! ఏ ఇతర భాషల వారికీ సజావుగా అంది రాని గీతాంజలి అనువాదాన్ని కమ్మని తెలుగులో అందిం చిన తెలుగు వాడు గుడిపాటి వెంకటాచలం! ఇన్ని రకాల భావబంధాలను అటు బెంగాలీలు, ఇటు తెలుగు వారు ఏర్పరుచుకున్నారు. పాలకులవల్ల ఈ జాతిలో పడిన ‘విభ జన’ విషబీజాన్ని శాశ్వతంగా తొలగించడానికి ప్రణబ్‌జీ అండదండలు అందించగలరన్న విశ్వాసం ఉంది.
 -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు

No comments:

Post a Comment