Tuesday 12 November 2013

ఉమ్మడిగా గ్రేటర్ Antony

ఉమ్మడిగా గ్రేటర్

Published at: 12-11-2013 06:50 AM
 2  1  1 
 
 

హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం ఇద్దరికీ పంపిణీ
విద్యా సంస్థల్లో ప్రవేశ నిబంధనలు పదేళ్లు యథాతధం
ప్రాజెక్టులపై స్వతంత్ర, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థ
నిష్పాక్షితంగా, న్యాయబద్ధంగా ఆస్తులు, అప్పుల పంపిణీ
టీఆర్ఎస్ నేతల హెచ్చరికలతో సీమాంధ్రల్లో ఆందోళన
వారిలో విశ్వాసం నింపాలి...కేంద్ర నిధులతోనే కొత్త రాజధాని
పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి
సీమాంధ్రలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు...పన్ను మినహాయింపులు
రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ
ఇదీ ఆంటోనీ కమిటీ సిఫారసుల సారాంశం
పన్నులు చెల్లిస్తున్న కంపెనీల్లో చాలావరకు హైదరాబాద్‌లోనే రిజిస్టర్ అయి ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో అధికభాగం హైదరాబాద్ నగరం నుంచే వస్తోంది. అందువల్ల, హైదరాబాద్ నగరం నుంచివసూలయ్యే రెవెన్యూను సీమాంధ్రకు కూడా పంపిణీ చేసేలా తగిన రక్షణ కల్పించాలి.
చాలావరకు విద్యా సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నందున... ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రస్తుతం అమలు అవుతున్న విధి విధానాలనే వచ్చే పది సంవత్సరాలపాటు అమలు చేయాలి.
ఉద్యోగుల 'ఆప్షన్స్'కు సంబంధించి భారత ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది. వాటినే అనుసరించాలి. 24 నెలల్లోపు రిటైర్ అయ్యే అన్ని కేడర్ల ఉద్యోగులను... వారి ఇష్టాన్నిబట్టి ఎక్కడ పని చేస్తుంటే అక్కడే కొనసాగించవచ్చు.
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి):మా (కమిటీ) ముందు ఉంచిన అంశాలు ఇవే..
1. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
2. నీరు, ఖనిజ వనరుల పంపిణీ.
3. స్టేట్ క్యాడర్ అధికారులు, గెజిటెడ్ అధికారుల విభజన.
4. ఆదాయం, ఆస్తులు, అప్పుల పంపకం.
5. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య, రవాణా వనరుల పంపిణీ.
6. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు రక్షణ... (జీవనోపాధి కల్పనకు సంబంధించిన ఆస్తులు, పెట్టుబడులు)విభజన తర్వాత సరికొత్తగా ప్రస్థానం సాగించాల్సిన సీమాంధ్ర అవసరాలపై ఆంటోనీ ప్రధానంగా దృష్టి సారించింది. 'సీమాంధ్రకు ఏం కావాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి' అనే ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తూ అనేక సిఫారసులు చేసింది. ఆంటోనీ అధ్యక్షతన అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్ సభ్యులుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన కమిటీ రూపొందించిన నివేదిక 'ఆంధ్రజ్యోతి' సంపాదించింది. గ్రేటర్ పరిధిని ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని ఆంటోనీ కమిటీ సిఫారసు చేసింది. 'తెలంగాణ వచ్చాక సంగతి చూస్తాం. విచారణ జరిపిస్తాం. భూములు స్వాధీనం చేసుకుంటాం' వంటి ప్రకటనల నేపథ్యంలో... 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత తేదీ నుంచి అమలు అయ్యేలా భూములుకానీ, ఆస్తులు కానీ స్వాధీనం చేసుకోరాదనే నిబంధన తప్పనిసరిగా ఉండాలి' అని కమిటీ స్పష్టం చేసింది. 371(డి)పై తన అభిప్రాయాలు వెల్లడించింది. వివిధ అంశాలపై తన సిఫారసులను స్థూలంగా నాలుగు పేజీల్లో వివరించింది. దాని పూర్తిపాఠం ఇది...
ఇవీ పరిష్కారాలు
1) ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం హైదరాబాద్ నగరం. అంతేకాదు, తెలంగాణ-సీమాంధ్ర ప్రజల మధ్య అత్యంత వివాదాస్పద అంశం కూడా హైదరాబాద్ నగరమే.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సరిహద్దులకు సంబంధించి మూడు మార్గాలున్నాయి. అవి...
హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధి.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి.
ఈ అంశంపై అందిన అనేక వినతిపత్రాలను పరిశీలించిన అనంతరం... హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని కమిటీ సూచిస్తోంది.
ఎందుకంటే... టీఆర్ఎస్ నేతల రెచ్చగొట్టే ప్రకటనల వల్ల హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తున్న, ఆస్తులు కూడగట్టుకున్న సీమాంధ్రల్లో ఆందోళన, భయం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీమాంధ్రుల్లో బలమైన విశ్వాసం పాదుకొల్పే నిబంధనలను ముసాయిదా బిల్లులో చేర్చాలని కమిటీ గట్టిగా సిఫారసు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో... పాత తేదీ నుంచి అమలులోకి వచ్చేలా ఆస్తులనుకానీ, వ్యాపార సంస్థలనుకానీ స్వాధీనం చేసుకోరాదంటూ బిల్లులోనే ఒక నిబంధన చేర్చాలి. (హైదరాబాద్ నగరంపై అనెగ్జర్-2లో సవివరంగా తెలిపారు.)
నదీ జలాల పంపకం
నీరు, సాగునీరు, విద్యుత్ వనరుల పంపిణీపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సవివరంగా చర్చించింది. ఈ నివేదికలోని 4.5.06, 4.508, 4.9 పేరాగ్రాఫ్‌లలో చేసిన సిఫారసులను కమిటీ సమర్థిస్తోంది. నికర జలాల ప్రాతిపదికన నిర్మించిన, నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులకు వివిధ ట్రిబ్యునళ్లు చేసిన కేటాయింపులు కొనసాగేలా ముసాయిదా బిల్లులోనే భద్రత కల్పిస్తూ... వాటిని ఒక స్వతంత్ర, స్వయంప్రతిపత్తిగల వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. ఈ వ్యవస్థలో రెండు రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారం... నీటి నిల్వ, పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
రెవెన్యూ, ఆస్తులు, అప్పుల పంపకం
ఆంధ్రప్రదేశ్ ఆస్తుల ఆదాయం, ఆస్తులు, అప్పుల పంపకంపై నిష్పాక్షికమైన, న్యాయమైన విధానాన్ని అనుసరించాలి. ఒక్కో ప్రాంత జనాభా, తలసరి ఆదాయంతోపాటు హైదరాబాద్ నగరం నుంచి వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.
సీమాంధ్రలో విద్య, వైద్య సదుపాయాలు
ప్రస్తుతం చాలావరకు ప్రధానమైన ఉన్నత విద్యా సంస్థలు, వైద్య సంస్థలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైనందున... సీమాంధ్ర ప్రాంతంలో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతరత్రా ప్రతిష్ఠాత్మకమైన విద్యా, వైద్య సంస్థలను సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పాటయ్యేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ప్రత్యేక ప్యాకేజీ
రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి భారత ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యేక ఆర్థిక ప్రాకేజీ ప్రకటించాలి.
పరిశ్రమలకు ప్రోత్సాహం..
ఐటీ రంగంతోపాటు ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమల్లో చాలావరకు హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమయ్యాయి. అందువల్ల... గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం వంటి పర్వత ప్రాంత రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు ప్రకటించినట్లుగా సీమాంధ్రకు వచ్చే పదేళ్లపాటు 'ట్యాక్స్ బెనిఫిట్ ప్యాకేజీ' (పన్ను మినహాయింపులు, రాయితీ) ప్రకటించాలి.
పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టును 'జాతీయ ప్రాజెక్టు'గా భారత ప్రభుత్వమే చేపట్టి, నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలి.
అంతర్జాతీయ విమానాశ్రయం
విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు సీమాంధ్ర రాష్ట్ర కొత్త రాజధానికి సమీపంలోని విమానాశ్రయాన్ని 'అంతర్జాతీయ విమానాశ్రయం'గా అభివృద్ధి చేయాలి.

- See more at: http://www.andhrajyothy.com/node/27302#sthash.9giMBxnT.dpuf

No comments:

Post a Comment