ప్రొరోగ్..పిడకల వేట కంటే చిన్నది
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే:కోదండరాం
హైదరాబాద్, నవంబర్ 23: అసెంబ్లీ ప్రొరోగ్ వ్యవహారం రామాయణంలో పిడకల వేట కంటే చిన్న విషయమని, దానిని తాము పట్టించుకోబోమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. "అసెంబ్లీ ప్రొరోగ్ అయినా కాకపోయినా.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై నిర్ణీత వ్యవధిలో చర్చ జరిగినా జరగకపోయినా.. ఆ బిల్లును పార్లమెంటుకు పంపించే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి'' అని చెప్పారు. ఆర్టికల్ 371 డి, ప్రొరోగ్ ఆలోచనలన్నీ అవివేకపు, మూర్ఖత్వపు ఆలోచనలేనని, తెలంగాణ ఆగే ప్రసక్తే లేదని అన్నారు. ముంబై జేఏసీ నేతలు శనివారం టీ-జేఏసీ నేతలను కలిశారు. అలాగే, 'భద్రాచలం తెలంగాణలో అంతర్భాగం' అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటు ముగింపు దశకు వచ్చిందని, సీమాంధ్ర పాలకులకు ఇంగిత జ్ఞానం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో విడిపోయిందని తెలుసుకుని శాంతియుతంగా విభజనకు సహకరించాలని, లేకుంటే కాల గర్భంలో కలిసి పోతారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌పై ఏ ఒక్క ఆంక్షనూ సహించబోమన్నారు. ప్రజల ఆకాంక్ష, ప్రయోజనాల మేరకే తెలంగాణ సరిహద్దులు ఏర్పాటు చేయాలని, ఒక్క జిల్లా ఎక్కువ.. ఒక్క గ్రామం తక్కువ ఇచ్చినా ఊరుకోబోమని, ఇప్పుడున్న తెలంగాణలో ఎలాంటి తేడా వచ్చినా పోరాటం తప్పదని హెచ్చరించారు. భద్రాచలం, మునగాల తెలంగాణలో అంతర్భాగమని, దానిపై చర్చ అవసరం
లేదని చెప్పారు.
లేదని చెప్పారు.
No comments:
Post a Comment