Tuesday 5 November 2013

సీమాంధ్రకు ప్యాకే 'జై' వరాల మూట

సీమాంధ్రకు ప్యాకే 'జై' వరాల మూట

Published at: 06-11-2013 08:10 AM
 1  0  1 
 
 

కేంద్ర మానవ వనరుల శాఖ కీలక ప్రతిపాదనలు
ఐఐటీ, ఐఐఎం,మూడు సెంల్ర్ వర్సిటీలు
ఐఐఎస్ఈఆర్, ఐఐటీ కూడా మంజూరు
రూ.7000 కోట్ల వ్యయానికి సుమఖం
పెట్రోలియం, జల వనరుల శాఖలు కూడా
నివేదికల రూపకల్పనలో మిగిలిన శాఖలు
విభజన జిల్లులోనే ప్యాఏజీ వివరాలు?
వడివడిగా పడుతున్న అడుగులు తెరపైకి రాయల్,హైదరాబాద్ యూటీ
'రాయల్ తెలంగాణ' కోసం 'అనంత' నేతల సంతకాల సేకరణ
ఔను అదే బెస్ట్ అని ఎంఐఎం నివేదిక
సీమాంధ్ర కేంద్ర మంత్రుల సానుకూలత
విడి విడిగానే పీసీసీ చీఫ్ నవేదికలు
అఢిప్రాయాలకు ముగిసిన గడువు
విభజన ఆగదేమో! : అశోక్‌బాబు
కేంద్ర సర్కారు విభజనపై వడివడిగా అడుగులు వేస్తోంది. విభజన వద్దుగాక వద్దంటున్న సీమాం«ద్రులను సంతృప్తిపరిచే ప్రయత్నంలో భాగంగా 'వరాల మూటలు' విప్పుతోంది. రాష్ట్రానికే చెందిన పళ్లంరాజు మంత్రిగా ఉన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ సీమాంధ్రలో ఉన్నతస్థాయి జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు 'సై' అంటూ ముందుకొచ్చింది. పెట్రోలియం శాఖ, జలవనరుల మంత్రిత్వ శాఖలు కూడా విభజనపై కేంద్రానికి నివేదికలు అందించాయి. మరోవైపు... విభజనపై అభిప్రాయాలు, సూచనలు పంపేందుకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. అయినప్పటికీ... ఎవరికి వారుగా, వేర్వేరుగా నివేదికలను రూపొందిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో మంగళవారం అనూహ్యంగా మళ్లీ 'రాయల తెలంగాణ' తెరపైకి వచ్చింది. అదేకాదు... 'హైదరాబాద్ యూటీ డిమాండ్' వినిపించింది. ఒకవైపు సమైక్యవాదం వినిపిస్తూనే... మరోవైపు 'విభజన తథ్యం' అనే అంచనాకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు విన్నపాలతో ఓ వినతిపత్రం రూపొందించారు. అందులో... 'కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు అంగీకరిస్తే రాయల తెలంగాణనూ పరిశీలించవచ్చు' అని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాం«ద్రుల పాత్ర, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని భాగ్యనగరిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు... అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా 'రాయల' ప్రస్తావన తెచ్చారు. మజ్లిస్ పార్టీ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలో 'రాయల తెలంగాణ'తో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది. హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించవద్దని తేల్చి చెప్పింది. ఇక... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ, సీమాంధ్ర నేతల అభిప్రాయాలతో విడివిడిగానే మంత్రుల బృందానికి నివేదికలు పంపించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 5:సీమాంధ్రకు ఒక ఐఐటీ! ఒక ఐఐఎం! మరో ఐఐఎస్ఈఆర్! ఇంకో ఐఐఐటీ! మూడు కేంద్రీయ విశ్వ విద్యాలయాలు! ఇవి కేవలం మానవ వనరుల శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టులే! ఇక, పెట్రోలియం.. జల వనరులు తదితర శాఖలూ తమ తమ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి! కేంద్ర మంత్రుల బృందానికి సమర్పిస్తున్న నివేదికల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు పలు ప్రతిపాదనలు చేస్తున్నాయి. పెద్దఎత్తున కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇవన్నీ సీమాంధ్ర ప్యాకేజీలో భాగమే! ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజాందోళనలను పరిష్కరించాలని తీర్మానించింది. ఈనెల ఏడో తేదీన జీవోఎం మలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో, ఇప్పటికే కేంద్ర మానవ వనరులు, జల వనరులు, పెట్రోలియం, సహజవాయువు శాఖలు తమ తమ నివేదికలను సమర్పించాయి. మిగతా శాఖలు కూడా బుధ, గురువారాల్లో నివేదికల్ని సమర్పించే అవకాశముంది.
రాష్ట్ర విభజనకు సానుకూలంగా సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయం తీసుకున్న వెంటనే సీమాంధ్రలో ఉద్యమం రగిలిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని, రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ సహా పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక విద్య, పరిశోధనా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్న నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతామని సీమాంధ్ర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కూడా. ఇవే అంశాలను పేర్కొంటూ ప్రజలు, వివిధ వర్గాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు జీవోఎంకు నివేదికలు, ప్రతిపాదనలు, సూచనలను అందించాయి.
జీవోఎం వాటిని వివిధ మంత్రిత్వ శాఖలకు పంపించింది. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న వివిధ మంత్రిత్వ శాఖలు ఈ నివేదికలను తయారు చేశాయి. ఈ నేపథ్యంలోనే, సీమాంధ్రలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఐఐఎంలతోపాటు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమేనని మానవ వనరుల శాఖ తన నివేదికలో పేర్కొంది. వీటితోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్), ట్రిపుల్ ఐటీలను కూడా సీమాంధ్రలో ఏర్పాటు చేస్తామని వివరించింది. విభజన జరిగితే సీమాంధ్ర విద్యార్థులు పెద్దఎత్తున నష్టపోతారంటూ వస్తున్న భయాలు, అనుమానాల నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడమే కాకుండా సీమాంధ్రకు వీలైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతిష్ఠాత్మక పరిశోధన, విద్యా సంస్థలకు దీటుగా సీమాంధ్రలో కూడా ఆయా సంస్థల్ని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మానవ వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంస్థల ఏర్పాటుకు దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని ఆ శాఖ అంచనా వేసింది.
కాగా, ఈ శాఖకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పళ్లంరాజు మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ప్రకటించినా.. దానిని అమలు చేసే తీరుపైనా పలువురు సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, సీమాంధ్రలో ఏర్పాటు చేసే విద్య, పరిశోధన సంస్థలను రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొనాలని, వాటి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించాలని, అన్ని జాతీయ పార్టీలూ ఈ మేరకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని జీవోఎంకు సమర్పించిన నివేదికల్లో పలువురు సూచించారు. విభజన జరిగిన ఏడాదిలోపే ఈ సంస్థలన్నింటినీ సీమాంధ్రలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని మానవ వనరుల శాఖ తన నివేదికలో పేర్కొంది.
- See more at: http://www.andhrajyothy.com/node/21940#sthash.42iEFOvj.dpuf

No comments:

Post a Comment