Tuesday, 5 November 2013

అక్కడే ఆగండి :చంద్రబాబు

అక్కడే ఆగండి :చంద్రబాబు

Published at: 06-11-2013 08:15 AM
      
 
 

రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర హోం శాఖకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి నివేదికా ఇవ్వలేదు! ముందే చెప్పినట్లు.. దాని బదులు నేరుగా ప్రధానికే లేఖ రాసింది! "రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలప్రజలకు ఆమోదయోగ్యంగా ముందుగా ఓ పరిష్కారాన్ని కనుక్కోండి! ఆ తర్వాతే విభజనపై ముందుకెళ్లండి'' అని తేల్చి చెప్పింది.
అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ఓ పరిష్కారానికి రావాలి ం ఆ తర్వాతే రాష్ట్ర విభజన విషయంలో ముందుకు వెళ్లాలి ం ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటూ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ం కేంద్ర కేబినెట్‌లో విభజన ప్రక్రియను టేబుల్ ఐటమ్‌గా పెట్టడం దారుణం. ం ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన రాష్ట్రాలన్నిటికీ ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు ం మూడు రాష్ట్రాల ఏర్పాటులో ఎన్డీయే ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబించింది ం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటప్పుడూ అప్పటి అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి ం కాంగ్రెస్ పార్టీ రాజకీయ అజెండా మేరకే కేంద్రం నిర్ణయాన్ని రుద్దుతోంది ం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలోనే ం దాని సిఫారసులను సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టాయి ం వివిధ పార్టీలు, ప్రజల సూచనలను పట్టించుకోకుండా కేవలం సీడబ్ల్యూసీ తీర్మానాన్నే పరిగణనలోకి తీసుకోవడమంటే.. విభజన కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే!
హైదరాబాద్, నవంబర్ 5: 'అన్ని ప్రాంతాలు, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాన్ని ముందు కనుగొనండి. ఆ తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై ముందుకెళ్ళండి' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదంతోనే విభజనపై ముందుకెళ్లాలని విఙ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై ప్రధాని అత్యవసర స్పందనను ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌరవిస్తూ తెలంగాణకు అనుకూలంగా టీడీపీ పొలిట్‌బ్యూరో చేసిన తీర్మానాన్ని ఆయన ప్రస్తావించారు. దీన్నే 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి, 2012లో నిర్వహించిన అఖిలపక్షంలో సుశీల్‌కుమార్ షిండేకు సమర్పించినట్లు గుర్తు చేశారు. ముందు నుంచీ ఈ విషయంలో తాము ఒకే మాటపై ఉన్నామని చెప్పుకొచ్చారు. తెలుగు మాట్లాడే ప్రజలందరికీ న్యాయం చేసేందుకే తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తమ తీర్మానంలో స్పష్టం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఇరు ప్రాంతాల్లోనూ ఉద్యమిస్తున్న ప్రజలను, ఇతర వర్గాలను పిలిచి చర్చించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలోనూ, పలు సందర్భాల్లోనూ కోరామని గుర్తు చేశారు. అందరికీ ఆమోదయోగ్య పరిష్కారానికి రావాలని సూచించామని, అయితే సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఏ మాత్రం పారదర్శకత లేదని, విభజన నిర్ణయం పూర్తి ఏకపక్షంగా ఉందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. 1956 నుంచి 2000 వరకు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల ప్రజలతో అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిల్లో చర్చలు జరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రతిపాదనలకు సంబంధించి మాత్రం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఇటు శాసనసభలో కానీ, అటు పార్లమెంటులో కానీ విస్తృత చర్చ జరగకపోవడం విచారకరమన్నారు. 'రాజకీయపక్షాలు, వివిధ ప్రాంతాల ప్రజలు చేసిన సూచనలను పట్టించుకోకుండా కేవలం సీడబ్ల్యూసీ తీర్మానాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడమంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకోసమేనన్నది సుస్పష్టమవుతోంది. కాంగ్రెస్ రాజకీయ అజెండా మేరకే కేంద్రం తన నిర్ణయాన్ని రుద్దుతోంది. ఇక ప్రణబ్, రోశయ్య, శ్రీకృష్ణ, ఏకే ఆంటోనీ కమిటీల్లో.. ఒక్క శ్రీకృష్ణ కమిటీ మాత్రమే పూర్తి స్థాయిలో.. లోతైన చర్చలు జరిగిన తర్వాతే నివేదిక ఇచ్చింది.
కానీ ఆ నివేదిక ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోయింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మాటిమాటికీ తెరమీదకు తెస్తూ పబ్బం గడుపుకొటోంది. మొదటి రెండు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు దక్కిన నేప«థ్యంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడింది. అదే రోజు టీఆర్ఎస్ విలీనం గురించి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడారు. అలాగే వైసీపీ అధినేత జగన్‌పై కేసులు ఎత్తేసి క్లీన్‌చిట్ ఇచ్చారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తూ టీఆర్ఎస్, వైసీపీలతో కాంగ్రెస్ కుమ్మక్కయింది' అని చంద్రబాబు తన లేఖలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అంశాన్ని కేబినెట్‌లో కేవలం టేబుల్ ఐటంగా ప్రవేశ పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల నేప«థ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై ముందుకువెళ్లాలని ప్రధానికి చంద్రబాబు విఙ్ఞప్తి చేశారు.
20 నుంచి జిల్లాల పర్యటన: తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి ఈ నెల 20న చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 10 రోజులు ఈ యాత్ర సాగనుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/21950#sthash.3638qwgs.dpuf

No comments:

Post a Comment