Tuesday 5 November 2013

విభజన ఆగదేమో!:అశోక్ బాబు

కాంగ్రెస్ తగ్గినా విభజన ఆగదేమో!:అశోక్ బాబు

Published at: 06-11-2013 09:09 AM
 New  0  0 
 
 

అయినా తుది వరకు పోరాడుతాం
ఎంపీల కేంద్రానిఇ మద్దతు ఉపసంహరించాలి :అశోక్ బాబు
హైదరాబాద్, నవంబర్ 5: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను ఆపే శక్తి కాంగ్రెస్‌కూ లేదన్న సందేహాన్ని ఏపీఎన్జీవోల జేఏసీ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు వెల్లడించారు. ఆ పార్టీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా విభజన ఆగదేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ సమైక్యాంధ్ర డిమాండ్‌తో తాము జరుపుతున్న ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎంపీలకు నిజాయితీ ఉంటే ప్రభుత్వంలో కొనసాగకుండా, బయటకు రావాలని, కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్రపతిని కలిసి లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభకు విభజన బిల్లు వస్తే తాము మళ్లీ నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తు ఉద్యమకార్యాచరణను నిర్ణయించేందుకు వచ్చే వారం ఉద్యోగులతోసహా అన్ని వర్గాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు చేయాల్సి ఉద్యమంపై 16న జరగనున్న విస్తృతస్థాయి సమావేశంలో కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు.
రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికను రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. నవంబర్ 7 నుంచి 15 వరకు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను అశోక్‌బాబు ప్రకటించారు. 16న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచన ఉందని, త్వరలోనే వేదికను ఖరారు చేస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఏపీఎన్జీఓ జేఏసీ నేతలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఢిల్లీలో వివిధ పార్టీల జాతీయ నేతలను కలిసి విభజనపైన, జీవోఎంపైన చర్చిస్తారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 17 న రైతు గర్జన. నెలాఖరులోగా కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జీవోఎం ఏర్పాటును నిరసిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో 7 వ తేదీన ప్రదర్శనలు. 8వ తేదీ సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు అన్ని వర్గాల ప్రజల సర్వమత ప్రార్థనలు. 9వ తేదీన మహిళల ప్రత్యేక ప్రదర్శనలు, సమావేశాలు. 14వ తేదీన నెహ్రూ జయంతిని పురస్కరించుకుని సమైక్యాంధ్ర డిమాండ్‌తో విద్యార్థుల ర్యాలీలు. 15న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులతో ప్రదర్శనలు ఉంటాయి.
మరోవైపు ఉద్యోగులకు నగదురహిత చికిత్సలనందించే క్రమంలో జారీ అయిన ఉత్తర్వులపై అశోక్‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ట్రస్టులో ఉద్యోగులకు అధిక భాగం ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేశామని, కానీ అలా జరగలేదన్నారు. ఈ క్రమంలో బుధ లేదా గురువారం ముఖ్యమంత్రిని కలిసి మధ్యంతర భృతి సహా తమ డిమాండ్లను మరోమారు వివరిస్తామని చెప్పారు. గతంలో జారీ చేసిన 177 జీవో నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని, తద్వారా తమ 66 రోజుల సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ శూన్యత ఉంది కానీ..
కొత్త పార్టీ పెట్టేంత సామర్థ్యం కానీ, సమయం కానీ తమకు లేవని అందుకే అలాంటి ఆలోచనేదీ చేయడం లేదని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఏపీఎన్జీఓ హోంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పార్టీ పెడుతున్నామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే తాము రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏమైనప్పటికీ ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది, దానిని భర్తీ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
- See more at: http://ec2-54-200-30-175.us-west-2.compute.amazonaws.com/node/22055#sthash.3IWqzXTI.dpuf

No comments:

Post a Comment