|
మతం మారిన వారికి తొగాడియా పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘సంస్కృతి, సంప్రదాయాలను వదిలేసి ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన హిందూ సోదరులారా.. తిరిగి మన మతంలోకి వచ్చేయండి.. మిమ్మల్ని ఆలిగంనం చేసుకొని, ఆదరించడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది’’ అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా పిలుపునిచ్చారు. వీహెచ్‌పీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, మేనేజ్‌మెంట్ కమిటీ సంయుక్త సమావేశం సోమవారం నగరంలోని రాయదర్గాలో గల నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు. సమావేశం అనంతరం వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి రామరాజుతో కలిసి తొగాడియా విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో.. ఇస్లాంలోకి మారిన హిందువులను పావులుగా ఉపయోగించారని ఆరోపించారు. ‘‘హిందూ’ అంటే జీవన విధానమం’’టూ సుప్రీం కోర్టే స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో సొంత మతానికి తిరిగి రావడం ఎట్టి పరిస్థితుల్లోనూ మత మార్పిడి కాదని వివరించారు. పునఃమార్పిళ్ల(ఘర్ వాపసీ)తో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయన్న కొందరి వాదనను ఆయన కొట్టిపారేశారు. వాస్తవానికి మత మార్పిళ్లే రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇటీవలే ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే 180602333666 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఉచిత వైద్య సలహాలు, సూచనలు అందుతాయని చెప్పారు. క్రైస్తవుల్ని, ముస్లింలను కోడళ్లుగా చేసుకుందాం జూ మన అమ్మాయిల్ని కాపాడుకుందాం.. బజరంగ్‌దళ్ కొత్త కార్యక్రమం ఆగ్రా, డిసెంబర్ 29: ‘ఘర్‌వాపసీ’ పేరుతో హిందూ సంస్థలు చేపట్టిన కార్యక్రమం వివాదాస్పదమైన నేపథ్యంలో.. బజరంగ్ దళ్ సంస్థ మరో కొత్త నినాదాన్ని అందుకుంది. అదే.. ‘బహు లావో.. బేటీ బచావో‘ (కోడళ్లను తెచ్చుకో.. కూతుళ్లను కాపాడుకో). పెళ్లీడు కుర్రాళ్లున్న ఇళ్లకు వెళ్లి, క్రైస్తవ, ముస్లిం మహిళలను ఆ అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందిగా అబ్బాయిల తల్లులకు, వారి కుటుంబాలకు నచ్చజెప్పే కార్యక్రమం. లవ్ జిహాద్ విషయంలో తెలివిగా మసలుకోవాలని హిందూ అమ్మాయిలకు చెబుతారట. ఆగ్రాలో ప్రారంభించే ఈ ప్రచారాన్ని ఫిబ్రవరి 2 నుంచి యూపీ వ్యాప్తంగా విస్తరించేందుకు బజరంగ్ దళ్ ప్రణాళికలు రచిస్తోంది. |
No comments:
Post a Comment