Tuesday 30 December 2014

భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలు ఖరారు

భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలు ఖరారు

Sakshi | Updated: December 30, 2014 15:08 (IST)
హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విధివిధానాలను ఖరారు చేసింది. 125 గజాలలోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 125 - 250 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్ కు 50 శాతం రాయితీ... 250 - 500 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్ కు 75 శాతం రాయతీ... 500 నుంచి ఆపై బడిన నివాస స్థలాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించి భూమిని క్రమబద్ధీకరణ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రోజు సాయంత్రం భూముల క్రమబద్దీకరణపై ఉత్తర్వులు జారీ చేసి అవకాశం ఉందని సమాచారం.

No comments:

Post a Comment