Monday 1 December 2014

ప్రభుత్వ విధానాలపై ఉద్యమానికి సిద్ధంకండి - కోదందరాం

ప్రభుత్వ విధానాలపై ఉద్యమానికి సిద్ధంకండి
నాటి పాలకులకు తీసిపోని నేటి పాలనసమష్టి పోరాటంతోనే తెలంగాణ ఏర్పాటు
రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం

బెల్లంపల్లి, నవంబర్‌ 30: నేటి తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులకు తీసిపోని విధంగా పాలన సాగిస్తోందని రాజకీయ జేఏసీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రజా సంఘాలు, పార్టీలు కలిసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలోని ప్రజా సంఘాలన్నీ సమష్టిగా ఉద్యమించడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా తూర్పు ప్రాంతంలోని గోలేటి, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, శ్రీరాంపూర్‌, నెన్నెల, శ్రావణపల్లిల్లో ఓపెన్‌కాస్టులు ఏర్పాటు చేసి బొందల గడ్డలుగా మార్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నాలను ప్రజలు పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment