Tuesday, 9 December 2014

‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు’

"వ్రుద్దాప్య నరకం" నుండి రక్షించేవారు పుత్రుడా? పుత్రికా?

                                                                         
ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయి, చిన్న కుటుంబాలుగా మన జీవన విదానం మార్పు చెందింది. అయితే దీని వలన ఏ విషయం ఎలా ఉన్నా, ముఖ్యంగా సంకట స్తితిలో నెట్టబడింది, కుటుంబాలలోని వ్రుద్దుల పరిస్తితి. సాదార్ణంగా,ఉమ్మడి కుటుంబాలలో, పెద్దల చేతిలో పెత్తనం ఉంటుంది కాబట్టి, ముసలివాండ్ల పరిస్తితి బాగుండెది. మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు,కోడల్లు తో అంరూ ఉండటం వల్ల అదే ఒక చిన్న సమూహం లాగ కళ కళ లాడుతూ ఉండేది. ఒకరు కాకపోతే మరొకరు,వ్రుద్దుల బాగోగులు చూడటానికి అవకాశం ఉండెది.కాబట్టి వారికి భద్రత ఉండేది.

  కాని ఇప్పట్టి చిన్న కుటుంబాలలో ఆ పరిస్తితి లేదు. ముసలి వాల్లను ఎవరు చూడాలి అనేది, ఒకరికి మించి కొడుకులు ఉన్న కుటుంబాల, ఆస్తుల పంపకాల సమయంలో పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. నీవు చూడు అంటే నీవు చూడు అని బాద్యతని తప్పించుకోవటానికే కొడుకులు కాని, వార్ని కట్టుకున్న కోడళ్లు  కాని చూస్తున్నారు. అప్పటిదాక ఒకటిగా కుటుంబాన్ని నడిపిన కొంతమంది దంపతులు, కొడుకుల "బాద్యత పంపకాలు"లో బాగంగా "విడాకులు" తీసుకున్న జంటలాగ  బర్త ఒక కొడుకి దగ్గర, బార్య  ఇంకొక కొడుకు దగ్గర బ్రతకాల్శిన దౌర్బాగ్యం ఏర్పడుతుంది.

 ఇంకొక  ముఖ్యమయిన విషయం ఏమిటంటే,ముసలి వారిని చూడాలంటే, చూసేవారికి కావాల్శింది, వారి పట్లప్రేమ లేకపోతే కనీసం కుటుంభ బాద్యత్ల పట్ల నిబద్దత . కాని ఈ తరం కోడళ్లలో కరువైందే ఈ రెండు.నూటికి పదిమంది ఉంటారేమో అటువంటి పుణ్యతల్లులు.కాబట్టి వ్రుద్దులు పరిస్తితి డోలాయమాన స్టితి అని చెప్పవచ్చు. అందుకే చాలమంది వ్రుద్దులు తమ శేష జీవితాలు కూతుళ్ల వద్ద గడపటానికే ఇశ్టపడున్నారు. దీని మీద మరింత సమాచారం కొరకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి.http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3190.html

 "పున్నామ నరకం నుండి కాపాడే వాడు పుత్రుడైతే,"వ్రుద్దాప్య నరకం" నుండి కాపాడ్డానికి పుత్రికే బెస్ట్ అనుకుంటా!" .  ఇక వీరు కూడ చూడకపోతే "వ్రుద్దాశ్రమాలే" గతి!  



‘పున్నామ నరకం’లో కొట్టుకుంటున్న తెలుగుదేశం!!

‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు’ అంటారు. కొడుకు అంటే ఉన్న డెఫినిషన్‌ అదే అన్నమాట. మరి ప్రతిపుత్రుడూ పున్నామ నరకం నుంచి తల్లిదండ్రుల్ని తప్పిస్తాడా? లేదా, పున్నామనరకం లేదా మరేదైనా కొత్త నరకాల పాల్జేస్తాడా? అనే సంగతిని ఇప్పుడు తెలుగుదేశం నాయకులనే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే.. ప్రత్యేకించి సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పున్నామ నరకంలో పడి కొట్టుకుంటున్నది. ఆ పార్టీ అభ్యర్థులు ప్రధానంగా పుత్ర గండాలను ఎదుర్కొంటున్నారు. పుత్రుల అతి చేష్టల వల్ల తెదేపా అభ్యర్థులుగా బరిలో ఉన్న వారి బతుకులు రచ్చకెక్కుతున్నాయి.
రెండు రోజుల కిందట.. పరిటాల రవి (సునీత) కుమారుడు శ్రీరాంను ఒక దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదివరలోనూ పలుకేసులు ఎదుర్కొంటున్న శ్రీరాం తాజాగా కోర్టులో లొంగిపోతే తప్పించుకోవచ్చునని అనుకున్నారు గానీ.. కోర్టు ఆయనను రిమాండుకు పంపింది. మరోవైపు కృష్ణాజిల్లాలో వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. గతంలో జరిగిన ఓ హత్యకేసులో ఆయన ప్రమేయం ఉన్నదంటూ తాజాగా హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణప్రసాద్‌ను అరెస్టు చేయడం విశేషం. వసంత కృష్ణప్రసాద్‌ ప్రస్తుతం తెదేపాకు నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు ఇన్చార్జిగా ఉన్నారు. నిరుడు ఓ టీచరు హత్య కేసులో ఆయన కూడా నిందితుడు. కోర్టు తీర్పుతో ఆయనను కూడా 15 రోజుల రిమాండుకు తరలించారు.
ఎన్నికల సీజను మొదలైన తొలిరోజుల్లోనే తెదేపా నేత గంటా శ్రీనివాసరావు కొడుకు ఎయిర్‌పోర్టులో తాగి నానా రభసచేయడం అరెస్టు కావడం అనేది వీటితో పోలిస్తే చాలా చిన్న సంగతి కింద లెక్క.
ఇలా నాయకుల పుత్రులంతా రిమాండులోకి వెళ్తుంటే సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు లీలలు ఇంకా పరాకాష్టకు చేరుకోవాల్సి ఉంది. నారా లోకేష్‌ శృంగార బాగోతం గురించి రెండు రోజుల కిందట కోలా కృష్ణమోహన్‌ కొన్ని సంగతుల్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో లోకేష్‌ తొలిభార్యను మీడియా ముందుకు తెస్తానని.. లోకేష్‌ కొడుక్కు డీఎన్‌ఏ పరీక్ష కూడా చేయించవచ్చునని కోలా అన్నారు. అది కూడా తేలిందంటే గనుక.. ఇక లోకేష్‌ కూడా కటకటాల పాలు కావల్సిందే.
ఆ రీతిగా నేతల పుత్రులంతా రిమాండులోకి వెళుతోంటే.. తెలుగుదేశం పున్నామ నరకంలో పడి కొట్టుకుంటున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
- See more at: http://telugu.greatandhra.com/politics/political-news/punnama-narakam-lo-kottukuntunna-telugu-desam-52375.html#sthash.eYwnmS1f.dpuf



మమ్మల్ని "పున్నామ నరకం" నుండి కాదు,"వ్రుద్దాప్య నరకం" నుండి కాపాడేదెవరు?

No comments:

Post a Comment