అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రాజధాని నిర్మాణం : మంత్రి నారాయణ
హైదరాబాద్, జులై 25 : అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రేపు(శనివారం) జరుగనున్న రాజధాని నిర్మాణ సలహా కమిటీ భేటీలో ప్రపంచస్థాయి కన్సల్టెన్సీల వ్యవహారంపై చర్చిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వీటి వివరాలు ఇచ్చేందుకు మెకంజీ, ఎల్అండ్‌టీ కన్సల్టెన్సీలు ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వచ్చాక మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని, రాజధాని నిర్మాణం కోసం సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్లు చెప్పారు. భూసేకరణకు మూడు పద్దతులు పాటించబోతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూముల సేకరణ, ప్రైవేటు భూములను కొనుగోలు చేసి వాటిని డెవలప్‌మెంట్ చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
No comments:
Post a Comment