వారానికోసారి కన్పించినా సంతోషమే
పార్లమెంటుకు మోదీ హాజరుపై కాంగ్రెస్
ప్రశ్నోత్తరాలలో దర్శనమిస్తారన్న సుష్మా
ఆయనేమైనా దేవుడా: ఖర్గే
100ు హాజరవుతున్న బీజేపీ ఎంపీలు
న్యూఢిల్లీ, జూలై 23: ఓవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే మరోవైపు ప్రధాని మోదీ సభలో కన్పించడం లేదంటూ విపక్ష ఎంపీలు గగ్గోలు పెడుతున్నారు. ‘ప్రధానిని రోజూ సభకు రావాలని మేం కోరడం లేదు. కనీసం వారానికి ఓసారైనా మోదీ సభలో కన్పిస్తే సంతోషిస్తాం.’అని మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై బుధవారం సుష్మాస్వరాజ్ సభలో వివరణ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో మోదీ సభ్యులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఖర్గే.. ‘ప్రధాని ఏమైనా దేవుడా.. అప్పుడప్పుడూ దర్శనం ఇవ్వడానికి’ అంటూ వ్యాఖ్యానించి సభలో నవ్వులు పూయించాయి. అయితే, మోదీ భయంతో బీజేపీ సభ్యుల హాజరు మాత్రం 100 శాతం ఉండటం గమనార్హం. బీజేపీకి చెందిన 280 మంది ఎంపీలు ఠంచన్‌గా పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు సూరజ్‌కుండ్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. ఎంపీల హాజరు విషయంలోనూ ఆయన గుజరాత్ తరహా విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన సహచరులు పేర్కొంటున్నారు. 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉ న్న మోదీ హయాంలో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల హాజరు 100 శాతం ఉండటం గమనార్హం.

No comments:
Post a Comment