Wednesday, 9 July 2014

ఏపీఎన్జీవో ఇళ్ల స్థలాలపై కావాలనే కొంతమంది వివాదం:అశోక్‌బాబు

ఏపీఎన్జీవో ఇళ్ల స్థలాలపై కావాలనే కొంతమంది వివాదం:అశోక్‌బాబు

Published at: 09-07-2014 20:05 PM
హైదరాబాద్, జులై 9 : ఏపీఎన్జీవో హౌసింగ్ సొసైటీ స్థలాలపై కొంతమంది కావాలనే వివాదం చేస్తున్నారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు విమర్శించారు. ఎపీఎన్జీవో హోంపై దాడులకు పాల్పడితే ఉద్యోగుల సభ్యత్వాన్ని రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల మధ్య సక్యత ఉంటేనే ఆప్షన్లు ఉంటాయని ఆయన అన్నారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వవద్దని చెబుతామని అశోక్‌బాబు అన్నారు. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీఎన్జీవోల తరఫున సన్మానం చేస్తామని అశోక్‌బాబు తెలిపారు.



ఉద్యోగులకు 5 రోజులు చాలు

Published at: 10-07-2014 05:41 AM
6 రోజుల పనిదినాలకు పట్టుబట్టం
పార్లమెంటుకు స్పష్టం చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 9: సెలవిచ్చిన తరువాత తీసుకుంటే ఎలా? అని ఉద్యోగులు అడుగుతున్నారేమో.. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆరు రోజుల పని దినాల పద్ధతికై పట్టుబట్టబోదని తెలుస్తోంది. యూపీఏ హయాంలో వారానికి ఐదు రోజలు పని దినాల పద్ధతిని అమలులోకి తెచ్చారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ శాఖల్లో ఆరు రోజులు పని చేయించాలని చూస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా.. శిక్షణ, సిబ్బంది శాఖ ఆమోదం లేకుండా ఆరు రోజుల పని దినాలను అమలు చేయలేరని ఉమ్మడి సంప్రదింపుల యంత్రాంగం జాతీయ కౌన్సిల్‌ కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా చెప్పారు. ఇటీవల రోడ్డు రవాణా శాఖ తన ఉద్యోగులను రెండో శనివారం తప్పితే మిగిలిన శనివారాల్లోనూ విధులకు హాజరు కావాలని కోరితే మహిళా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి నితిన్‌ గడ్కరీ ఆ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గారు. ఆరు రోజుల పని దినాల వలన కరెంటు బిల్లు పెరగడం తప్పితే మరేమీ ఉపయోగం ఉండదని యూనియన్‌ నాయకులు చెబుతున్నారు. కొందరు ఎంపీలు ఈ విషయమై పార్లమెంటులో ప్రశ్నించారు. దీంతో ఐదు రోజుల పని దినాల పద్ధతినే అనుసరిస్తామని ప్రభుత్వం సమాధానమివ్వనుంది.

No comments:

Post a Comment