ప్రతి ఇంటికీ ఒక రుణం రద్దు
2014 ఏప్రిల్ 1 లోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింపు..
రాజధాని ఖరారయ్యాక అభివృద్ధి పరుగులు పెట్టిస్తా..
తెలంగాణాతో కలహించుకోవడం ప్రయోజనం లేదు..
విలేకరుల సమావేశంలో బాబు

విజయవాడ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పంట రుణాల మాఫీకి సంబంధించి ప్రతి కుటుంబానికి ఒక రుణం రద్దు అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2014 ఏప్రిల్ 1వ తేదీ లోపు తీసుకున్న రుణాలకు మాఫీ పథకం వర్తిస్తుందని చంద్రబాబు చెప్పారు. తొలుత రుణాల రీ షెడ్యూల్ మాత్రమే చేసి ఆ తర్వాత వెసులుబాటును బట్టి ప్రభుత్వం రద్దయిన రుణాల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుందని ఆయన ప్రకటించారు. శనివారం రాత్రి ఇరిగేషన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వర కు ఉన్న అంచనాల ప్రకారం ఏపీకి రూ. 15,900 కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందని అన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సమకూర్చాల్సి ఉంటుందన్నారు. రెండు రాషా్ట్రల విభజన అనంతరం అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప పోట్లాటలు, విద్వేషాలకు దిగరాదని హితవు పలికారు. రెండు ప్రాంతాల అభివృద్ధిపై తనకు ఒక నిబద్ధత ఉందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ కూడా పెరగాలని చెబుతూ ’’ప్రపంచం విశాలమైనది. పెట్టుబడులకు కొదువ లేదు. జపాన్, మలేసియా, సింగపూర్, ఽథాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల నుంచి నేరుగా ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టటానికి వస్తున్నారు. పెట్టుబడులు రాబట్టడంలో పోటీ పడాలని’’ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నాది మొబైల్ ప్రభుత్వం
రాష్ట్ర పరిపాలన మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలి రావటానికి కొంత సమయం పడుతుందని, ఈలోగా అవసరం అనుకుంటే తాను టెంట్ వే సి అయినా కూర్చుని పనిచేసే ఆలోచన ఉన్నదని చంద్రబాబు అన్నారు. ‘‘హైదరాబాద్ నుంచి నేను ఎటు వెళ్ళాలన్నా 170 -200 కిలోమీటర్లు వెళితే కానీ పరిపాలనా ప్రాంతాలకు రాలేక పోతున్నాను. హైదరాబాద్‌లో కూర్చోవటానికి స్థలం లేదు. సెక్రటేరియట్ ఇంకా సెట్ అవలేదు. అలా అని వెంటనే ఇక్కడకు వచ్చి పనిచేద్దామంటే.. ఇక్కడి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. నేనొక్కడినే వచ్చి కూర్చున్నందువల్ల ఉపయోగం ఏమి ఉంటుంది? సిబ్బంది, అధికారులు తరలి రావాలి. అందుకు అనువైన వసతులు, కార్యాలయ భవనాలు కావాలి. ఉద్యోగులు తరలి రావటానికి అంతగా ఇష్టపడరు. పిల్లల చదువులు, ఇతరత్రా సమస్యలు ఉంటాయి. రోడ్డు, విమాన రవాణా ఇంకా పెరగాలి. రాజఽధాని విషయం కూడా తేలటానికి ఇంకొంత సమయం పడుతుంది. కమిటీ నివేదిక రాగానే రాజధాని ఖరారు అవుతుంది. ఆ తర్వాత అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుందనేది మీరే చూస్తారు. అప్పటి వరకు జిల్లాలలో వారానికి రెండు రోజులు పర్యటిస్తాను’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

లాజిస్టిక్ హబ్‌గా విజయవాడ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన మదిలో ఒక బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు. విజయవాడ ప్రాంతాన్ని లాజిస్టిక్ హబ్‌గా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణానదీ తీరం వెంబడి నగరం ఉండటం మరో ప్రత్యేకత. నగరాన్ని చక్కని సిటీగా తయారు చేయవచ్చు. మచిలీపట్నం పోర్టును కూడా వేగంగా పూర్తి చేయిస్తాం. అక్కడ ఒక ఆయిల్ రిఫైనరీ, క్రాకరీ యూనిట్‌లను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తాం. మచిలీపట్నం పోర్టు పూర్తయితే తెలంగాణాకు దగ్గరగా ఉన్న పోర్టు అవుతుంది’’ అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణా ప్రాంతానికి వచ్చిన నష్టం లేన్నారు. నష్టం లేనపుడు గొడవ చేయటం సమంజంసం కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన గ్రామాలు కూడా 1956 ముం దు ఈ రాష్ట్రంలో ఉన్నవేనని, వివాదానికి తావులేదని చెప్పారు.

16లోగా రుణమాఫీపై స్పష్టత: మంత్రి పుల్లారావు
గుంటూరు(విద్య), జూలై 12: రైతుల రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌పై ఈనెల 16 (బుఽధవారం) తేదీలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం నియమించిన కోటయ్య కమిటీ నివేదిక పూర్తిస్థాయిలో అందుతుందని రాష్ట్ర వ్యసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైతుల రుణమాఫీని కచ్చితంగా అమలుచేసి తీరుతామన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కోటయ్య కమిటీ పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాల్సి ఉందని చెప్పారు. నివేదిక అందిన వెంటనే కార్యచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. ఖరీఫ్ రుణాలకు సంబంఽధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామన్నారు. కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్రస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు గుంటూరు జిల్లాకు వస్తాయని, ఇందుకోసం లాంఫాం, ప్రత్తిపాడు వద్ద 700 ఎకరాలు భూమి అందుబాటులో ఉందని చెప్పారు. అదేవిధంగా రూ.1500 కోట్లతో ఎయిమ్స్‌ను మంగళగిరి టీబీ శానిటోరియం వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, సౌత్‌జోన్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ జీరో బిజినెస్‌ను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆడిటర్లకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు.

No comments:
Post a Comment