Tuesday, 15 July 2014

కేఎల్‌రావు 112వ జయంతి


భావితరాలకు కేఎల్‌రావు ఆదర్శ ప్రాయుడు : చంద్రబాబు

Published at: 15-07-2014 13:40 PM
హైదరాబాద్, జులై 15 : దివంగత ఇంజనీర్ కేఎల్‌రావు భావితరాలకు ఆదర్శప్రాయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. కేఎల్‌రావు 112వ జయంతి సందర్భంగా అమీర్‌పేటలోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ గురించి చెబితే మొదట గుర్తు వచ్చే వ్యక్తి కేఎల్‌రావు అని ఆయన అన్నారు. కేఎల్‌రావు జయంతిని ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు.
నదుల అనుసంధానంపై కేఎల్‌రావు ఆలోచనలు ఎన్నోసార్లు తెరపైకి వచ్చాయని గుర్తుచేసుకున్నారు. అవినీతిని కేఎల్‌రావు ఉపేక్షించేవారు కాదని తెలిపారు. నీటి కోసం అనేక గొడవలు జరుగుతున్నాయని, వీటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేఎల్‌రావు స్పూర్తితో వాటర్ మేనేజ్‌మెంట్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని, డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment