Sunday, 20 July 2014

పంచుతూ పోతే పంచె మిగులుతుంది : వెంకయ్యనాయుడు

పంచుతూ పోతే పంచె మిగులుతుంది : వెంకయ్యనాయుడు

Published at: 20-07-2014 19:35 PM
తిరుమల, జులై 20 : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంక్యయ్యనాయుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా పంచ్ డైలాగులు పేలుతునే ఉంటాయి. తన వాగ్దాటితో విపక్షాలను గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తుంటారు. పంచె నుంచి చొక్కా దాకా ఏదీ వెంకయ్య పంచలకు ఏదీ అనర్హంకాదు. పంచుకుంటూ పోతే పంచెలే మిగులుతాయని చెప్పడం ఆయనకే చెల్లింది.
ఆదివారం తిరుపతిలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కొంతమంది వామపక్ష నేతలు పంచాలని చెబుతుంటారని... అందులో వాళ్ల తప్పులేదని, అయితే పంచాలంటే ముందు పెంచాలికదా అని.. పెంచితే కదా పంచేది అని... పెంచకుండా పంచితే చివరికి పంచే మిగులుతుందని ఆయన చమత్కరించారు.
మొన్న రైల్వే ఛార్జీలు పెంచామని వామపక్షనేతలు పెంచవద్దని ఆందోళన చేశారని, ఏవీ పెంచవద్దని అంటారని... మరి ఏం పెంచకుండా ఎలా పంచేదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావచ్చునని, అప్పు తీర్చే విధానాన్ని తెలపాలని ఆయన అన్నారు. ఎవరూ పూల మాలలు తేవద్దని, బొకేలు కూడా ఇవ్వద్దని... ఒక పుష్పం గానీ, చిన్న నిమ్మకాయగాని ఇవ్వాలని నేతలు, కార్యకర్తలకు వెంకయ్యనాయుడు సూచించారు. అసలు ఏమీ వద్దని, ఒక నమస్కారం పెట్టాలని, దానికి మించిన సంస్కారం లేదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment