తూగో : గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌కు తాళం వేసేందుకు స్థానికుల యత్నం
తూగో, జులై 25 : జనావాసాల నుంచి గ్యాస్ స్టేషన్లను తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌కు తాళం వేసేందుకు స్థానికులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల నగరం గ్యాస్ దుర్ఘటన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్‌లను జనావాసాల నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు.
అయితే అలాంటి ప్రయత్నాలేవి ప్రభుత్వం కాని, అధికారులు చేయడం లేదనే ఆగ్రహంతో స్థానికులు, అన్ని పార్టీల నేతలు కలిసి గెయల్ కార్యాలయంతో పాటు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌కు తాళాలు వేశారు. వారిని పోలీసులు అడ్డుకుని వేసిన తాళాలను బద్దలు కొట్టారు. మరోవైపు స్థానికులు తమ ఆందోళనలను కొనసాగించారు.
No comments:
Post a Comment