Thursday, 24 July 2014

న్యాయ వ్యవస్థలోనూ బీసీలకు అన్యాయం

న్యాయ వ్యవస్థలోనూ బీసీలకు అన్యాయం

Published at: 24-07-2014 08:42 AM
జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యాఖ్య
మాది ఆత్మగౌరవ పోరాటం: ఆర్‌.కృష్ణయ్య
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థలోనూ వెనుకబడినవర్గాలకు అన్యాయం జరిగిందని జాతీయ బీసీ కమిషన్‌  చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు. ఇప్పటికీ న్యాయవ్యవస్థలో ఉద్యోగాల భర్తీలో బీసీలకు, ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమని ఆయన బుధవారం జాతీయ బీసి సంక్షేమ సంఘం  ఆవిర్భావ సదస్సులో మాట్లాడుతూ అన్నారు. . కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో క్రీమీలేయర్‌ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీల విషయంలోనూ వర్గీకరణ అమలు చేయాలని, బీసీ కమిషన్‌కు చట్టబద్దత కల్పించాలని ఆయన అన్నారు. కాగా బీసీలది ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య అన్నారు. బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని ఎంపి ఆనంద్‌ భాస్కర్‌ అన్నారు.

No comments:

Post a Comment