విద్వేషాలు వెళ్లిపోతాయ్!
ఇప్పుడు విడాకులు తీసుకున్న జంట పరిస్థితి
‘ఫీజు’ల నేపథ్యంలోనే స్థానికత వివాదం!
1956 సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం
ఆర్థిక వెన్నుదన్ను హైదరాబాద్ నగరమే
ఐదేళ్లలో స్మార్ట్‌సిటీగా ఆవిర్భావం
‘ఫిక్కీ లేడీస్’ సమావేశంలో మంత్రి కేటీఆర్
‘ఫీజు’ల నేపథ్యంలోనే స్థానికత వివాదం!
1956 సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం
ఆర్థిక వెన్నుదన్ను హైదరాబాద్ నగరమే
ఐదేళ్లలో స్మార్ట్‌సిటీగా ఆవిర్భావం
‘ఫిక్కీ లేడీస్’ సమావేశంలో మంత్రి కేటీఆర్
మహిళల భద్రత గురించి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. సంఘటన జరిగిన 10 నిమిషాల్లో పోలీసులు అక్కడ ఉండాలన్నది కేసీఆర్ నిర్ణయం. లండన్, న్యూయార్క్ పోలీసు తరహాలు హైదరాబాద్ పోలీసులు కూడా మారతారు. సైబరాబాద్‌లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం.
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి సిటీబ్యూరో): ‘‘రాషా్ట్రలుగా విడిపోయినంత మాత్రాన విద్వేషాలు పెంచిపోషించాల్సిన అవసరం లేదు. కానీ... విడాకులు పొందిన జంట ఆనందంగా మాత్రం ఉండదని చెప్పక తప్పదు. ఇప్పుడు మనం విడాకులు తీసుకున్న జంట స్థితిలో ఉన్నాం. ఈ విద్వేషాలు ఇలా వచ్చి అలా పోయే మేఘాల్లాంటివి’’ అని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అందరితోనూ స్నేహపూరిత వాతా వరణం ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. ‘‘పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒకేలా ఉండాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌ఓ) సంయుక్తంగా ‘విజన్ ఫర్ తెలంగాణ’ పేరిట నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి నుంచి ఫీజు రీఇంబర్స్‌మెంట్ వివాదం దాకా అడిగిన అనేక అంశాలపై కేటీఆర్ సమాధానమిచ్చారు. పూర్తి ఆహ్లాదభరితమైన వాతావరణంలో జరిగిన కేటీఆర్ ఆయా అంశాలపై ఎలా స్పందించారంటే...
ఫీజు రీఇంబర్స్‌మెంట్: నిరుపేద విద్యార్థులకు లబ్ధి కలిగించే పథకం ఉద్దేశాన్ని నీరుగార్చారు. కొన్ని కాలేజీలు కేవలం ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసమే ఏర్పాటు చేశారంటే ఆశ్చర్యం వేస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలనుకున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించటానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ కూడా. దీనివల్ల కొంత మంది పేదలకు లబ్ధి కలగడం నిజమే అయినప్పటికీ, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ఇది బంగారు బాతులా మారింది. ఇవే నిధులను ప్రభుత్వ వైద్యశాలలు, విద్యాసంస్థలను మెరుగుపరచటానికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నదే మా భావన.
స్థానికత: ఇక 1956 స్థానికత గురించి మాట్లాడేముందు మీడియా వారు తమ కెమెరాలను ఆపేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మా నాన్న నేనూ కలిసే ఉంటున్నాం. మా ఇద్దరి మధ్య అపోహలకు తావు లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా చెప్పటానికి ప్రయత్నిస్తా. ఇది ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ గురించి వచ్చింది. ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు. అమెరికాలాంటి దేశంలోనే ఐదేళ్లు ఉంటే స్థానికునిగా గుర్తిస్తుండగా... ఇక్కడ 1956 నియమం పెట్టడం ఏమిటని చాలామంది అడుగుతున్నారు. నిజమే, అలాగని వారికి (అమెరికాలో) అన్ని బెనిఫిట్స్ అందించటం లేదు కదా! తెలంగాణ కోసం తమ రక్తం ధారపోసిన వారికి లబ్ధి చేకూర్చటానికే 1956ను ప్రామాణికంగా తీసుకున్నాం. 1956 ముందు రెవెన్యూ ప్రాంతాలన్నీ ఆంధ్రలో కలిపేయమని అడుగుతున్న ఆంధ్ర నాయకులు మాటల వల్లనే ఇలా అనాల్సి వచ్చింది. అయినా, మేం ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఆ సాధ్యాసాఽధ్యాలను పరిశీలిస్తున్నాం.
హైదరాబాద్ నగరం: అప్పట్లో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌కు అయినా, ఇప్పుడు తెలంగాణ రాషా్ట్రనికి అయినా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది, నిలుస్తున్నది హైదరాబాదే. రాషా్ట్రభివృద్ధికి ఇంధనం హైదరాబాద్ నగరమే. తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలో కూడా స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రెండుచోట్లా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగిన నేతలే ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తుంది. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ కచ్చితంగా స్మార్ట్‌సిటీగా ఉంటుంది. నగరంలో మురికివాడలు అనేవి లేకుండా చేయాలన్నది కేసీఆర్ లక్ష్యం.

రాష్ట్ర విభజన - విధానం: మనదేశంలో రాషా్ట్రలను సరిగా విభజించడం జరగలేదు. రాషా్ట్రల విభజనకు తగిన ప్రమాణాలు కూడా అనుసరించలేదు. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద పరిపాలనా యూనిట్‌గా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మన దేశంలోనే ఉంది. ఇక... గోవా ఎంత చిన్న రాష్ట్రమో తెలిసిందే.
క్రీడలు: మనదేశంలో క్రీడలను ప్రోత్సహించే సంస్కృతి లేదు. సానియా, సైనా, గోపీచంద్, ముఖేశ్, మిఽథాలీ, టెండూల్కర్, గగన్ నారంగ్.. ఇలా అందరూ మనకున్న సో కాల్డ్ సిస్టమ్‌కు ఎదురెళ్లి ఈ స్థాయిలో నిలబడ్డారు. అందుకు ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలకు ఎన్నో పనులు. తల్లిదండ్రులలో కూడా క్రీడలను ప్రోత్సహించే సంస్కృతి కనబడటం లేదు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తరువాత స్పోర్ట్స్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతకు ఇష్టమైన క్రీడల్లో తర్ఫీదు ఇవ్వాలని చెప్పాం. ఏమైనా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో క్రీడాభివృవృద్ధికి ఆస్కారం ఉంది.

No comments:
Post a Comment