రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా
హైదరాబాద్, జులై 15 : రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభంకాగానే లష్కరే చీఫ్ హఫీద్ సయీద్‌ను విలేకరి వేద్ ప్రతాప్ వైదిక్ కలవడంపై రాజ్యసభలో ఈరోజు కూడా రభస నెలకొంది. సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలకు దిగారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలగటంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
న్యూఢిల్లీ, జులై 15 : విలేకరి వేద్ ప్రతాప్ వైదిక్ వ్యవహారంపై రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో సభ మరోసారి వాయిదా పడింది. లష్కరే చీఫ్ హఫీద్ సయీద్‌ను విలేకరి వేద్ ప్రతాప్ వైదిక్ కలవడంపై సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలకు దిగారు. సభా కార్యకలాపాలకు సహకరించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అంతకు ముందు ఇదే అంశంపై ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే 15 నిమిషాలు వాయిదా పడింది.
వేదిక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదు : లోక్‌సభలో సుష్మా
న్యూఢిల్లీ, జులై 15 : ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయిద్‌తో విలేకరి వేద్ ప్రతాప్ వైదిక్ కలవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదని లోక్‌సభలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ప్రభుత్వం ఆరోపణలు నిరాధారమని ఆమె అన్నారు. మంగళవారం ఉదయం లోక్‌సభ ప్రారంభంకాగానే వైదిక్ వ్యవహారంపై సభలో దుమారం చెలరేగడంతో సుష్మా వివరణ ఇచ్చారు.
No comments:
Post a Comment