బాబు పాలన భేష్
- అమలులోకి వస్తున్న ఎన్నికల హామీలు
- రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐని ఒప్పించాం
- ‘విభజన’ హామీలకు కృషిచేస్తున్నాం: యనమల
- రాజధాని ఎక్కడో కేంద్రమే నిర్ణయిస్తుందని వ్యాఖ్య
హైదరాబాద్, జూలై 8(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గంటకో నిర్ణయం తీసుకుంటూ అత్యంత చురుకుగా పని చేస్తున్నారని ఆర్థికమంత్రి యనమల రామ కృష్ణుడు చెప్పారు. ప్రమాణ స్వీకారం నాడే ప్రజ ల సమక్షంలో ప్రకటించిన ఐదు సంతకాలకు సంబంధించిన విధానాలన్నింటినీ నెలరోజుల్లోనే రూపొందించి, అమలులో పెట్టబోతున్నారని చెప్పారు. సచివాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించిన యనమల.. నెల రోజుల చంద్రబాబు పాలన గురించి వివరించారు. ఎన్నికల హామీ మేరకు వ్యవసాయ రుణాల మాఫీపై పెద్దఎత్తున కసరత్తుచేసి.. పంట రుణాల రీషెడ్యూలుకు ఆర్బీఐ అంగీకరించేలా చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం చేయని ప్రయత్నాలు లేవని.. ఇందులో భాగంగానే నాలుగు లక్షల టన్నుల అదనపు బొగ్గును కేంద్రం నుంచి మంజూరు చేయించారని చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చెలా వెంటపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే, పట్టుకున్న కలపను విక్రయించి ఖజనాకు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయ త్నాలు చేస్తున్నామని చెప్పారు. తాము మార్కుల కోసం పనిచేయడం లేదని.. ప్ర జల అవసరాలను తీర్చేందుకు కష్టపడుతున్నామని చెప్పారు. గుంటూరు, విజయవాడలలో రిజిస్ర్టేషన్లు నిలిపివేయాలన్న దానిపై స్పందిస్తూ.. అలాంటి ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. రాజధాని ఎక్కడ అనేది కేంద్రం నిర్ణయిస్తుందని.. ఆమేరకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలో ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్న మాదిరిగానే ఉండాలని.. ఈమేరకే సీఎం కేంద్రానికి లేఖ రాశారన్నారు. దీనిపై గవర్నర్‌కు సమాధానం వచ్చిందో ..లేదో ఇంకా తెలియదని చెప్పారు.

No comments:
Post a Comment