సానియా మీర్జాకు ‘స్థానికత’ వర్తించదా?
ఆమెను ‘తెలంగాణ అంబాసిడర్’గా ప్రకటిస్తారా?
ఆమెకు రూ.కోటి, ఎవరెస్టు ఎక్కిన పిల్లలకు రూ.25 లక్షలా?: కె.లక్ష్మణ్
ఏబీఎన్ ప్రసారాల పునరుద్ధరణపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్
ఆమెకు రూ.కోటి, ఎవరెస్టు ఎక్కిన పిల్లలకు రూ.25 లక్షలా?: కె.లక్ష్మణ్
ఏబీఎన్ ప్రసారాల పునరుద్ధరణపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు 1956 సంవత్సరాన్ని స్థానికతకు ప్రామాణికంగా తీసుకుంటామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతోందని, మరి అదే నిబంధన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాకు వర్తించదా? అని బీజేపీ శాసన సభ పక్ష నేత కె.లక్ష్మణ్ నిలదీశారు. మహారాష్ట్రలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగి, పాకిస్థాన్ కోడలైన సానియాను ‘తెలంగాణ అంబాసిడర్’గా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, అధికార ప్రతినిధి ఎస్.ప్రకాష్‌రెడ్డిలతో కలిసి బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. గత ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులంతా జాతీయ పతాకాన్ని పట్టుకుని స్టేడియంలో తిరిగితే పతాకాన్ని పట్టుకోకుండా సానియా అగౌరవపర్చారని ఆరోపించారు. అలాంటి సానియామిర్జాను తెలంగాణ అంబాసిడర్‌గా ప్రకటించడం ఎంత వరకు సమంజసమని, పైగా ఆమెకు రూ.కోటి నజరానా ఎలా ఇస్తారని అన్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు దళిత, పేద పిల్లలకు రూ.25 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం... జాతీయ పతాకాన్ని అవమానపర్చిన సానియాకు రూ.కోటి ఇచ్చిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టి విధానాలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ముస్లింలకు మూడు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తామంటూ సీఎం కేసీఆర్ మంగళవారం నాటి ఇఫ్తార్ విందులో ప్రకటించారని, ఎంఐఎం డిమాండ్ చేయగానే ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను ముద్రించారని, తెలంగాణలో నవాజ్ అలీ జంగ్ జయంతిని ఇంజనీర్స్ డేగా ప్రకటించారని, రంజాన్ పండగ నేపథ్యంలో ఈ నెల 25ననే వేతనాలు చెల్లిస్తామంటూ కేసీఆర్ ప్రకటించారని అన్నారు. జీతాలు 25న ఇవ్వడం పట్ల తమకు అభ్యంతరం లేదని, కానీ దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగల సందర్భంగా కూడా ఇలాగే వేతనాలు చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. నవ తెలంగాణ నిర్మాణమంటే ముస్లింలను సంతుష్టిపర్చడమేనా అని నిలదీశారు. పైగా టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కాశ్మీర్, తెలంగాణ ప్రత్యేక దేశాలని, వీటిని బలవంతంగా భారత్‌లో విలీనం చేశారని, మళ్లీ భూభాగాలపై సర్వే చేయాలంటూ వ్యాఖ్యానించారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, ఆమె వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ సమర్థిస్తుందా? కేసీఆర్ ఏకీభవిస్తారా స్పష్టం చేయాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎంఐఎంతో అంటకాగుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. తాము మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని, ప్రభుత్వం ముస్లిం సానుకూల విధానాలను మార్చుకోకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయాలని అన్నారు.
ఏబీఎన్ ప్రసారాలపై ప్రభుత్వం
చొరవ చూపాలి
ఏబీఎన్ చానెల్ ప్రసారాలను పునరుదఽ్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఉత్తరం రాసినా... ప్రభుత్వం చోద్యం చూస్తుందని కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో పత్రికలు, చానెళ్లపై కొనసాగుతున్న నిర్బంధాన్ని దేశం యావత్తు చూస్తుందని, ఇది మంచి సంప్రదాయం కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి చానెల్ ప్రసారాలను పునరుదఽ్ధరించేలా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సానియాను ఏం ఆశించి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు? : ప్రభాకర్
హైదరాబాద్, జులై 25 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం ఆశించి సానియా మిర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసే విషయంలో విధివిధానాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాసంక్షేమంపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే ప్రభాకర్ సూచించారు.
భారతీయురాలినే అని పదే పదే చెప్పుకోవలసి రావడం బాధంగా ఉంది : సానియా మీర్జా అవేదన
హైదరాబాద్, జూలై 25 : తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడార్‌గా తన నియామకంపై రేగిన వివాదంలో చెప్పడానికి ఏమీ లేదని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పష్టం చేశారు. తాను వివాదాల జోలికి పోదల్చుకోలేదని ఆమె వెల్లడించారు. తాను ఎప్పటికీ భారతీయురాలినేనని ఇంతకు ముందే చెప్పిన సానియా... ఈ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తనపై వస్తున్న వివాదాలపై సానియా మీర్జా కన్నీటి పర్యంతమయ్యారు. బ్రాండ్ అంబాసిడార్‌పై అనవసర వివాదం రేగుతోందని ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీరు మన్నీరయ్యారు. వివాహం అయిన తర్వాత కూడా తనకు మెడల్స్ వచ్చాయని, జీవితాంతం భారత్‌లోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. నా మూలాలను ప్రశ్నించేవారిని వదిలిపెట్టనని, భారతీయురాలినని చెప్పకోవడం గర్వంగా ఉందని సానియా అన్నారు.ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు ఇక ఇంటర్ మార్కులే ఆధారం.
ప్రతీసారీ ఎందుకిలా నా జాతీయత గురించి ప్రశ్నిస్తున్నారో అర్ధం కావడంలేదని సానియా ఆవేదన వ్యక్తం చేశారు. మనం పురుషాధిక్య ప్రపంచంలో జీవిస్తున్నాం గనుక ఈ ప్రశ్నలు వేస్తున్నారనుకోవాలా అని ఆమె అన్నారు. ఏది ఏమైనా ఇలా చెప్పుకోవలసి రావడం బాధగా ఉందని సానియా వ్యాఖ్యానించారు.
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2014/07/26/ArticleHtmls/26072014005008.shtml?Mode=1
కేసిఆర్ ప్రవర్తన మార్చుకోవాలి - వీహెచ్ పి.
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2014/07/26/ArticleHtmls/26072014005010.shtml?Mode=1
వీహెచ్ అనుచుత వ్యాఖ్యలు తగదు - షబ్బీర్
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2014/07/26/ArticleHtmls/26072014005014.shtml?Mode=1
అజహర్ ను నియమిమ్చాలని మాత్రమే అన్నా - వీహెచ్
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2014/07/26/ArticleHtmls/26072014005016.shtml?Mode=1
సంఘ్ పరివార్ యంపీలు బెదిరిస్తున్నారు - అసద్
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2014/07/26/ArticleHtmls/26072014005012.shtml?Mode=1
No comments:
Post a Comment