Wednesday, 19 February 2014

కిరణ్ రాజీనామాతో కాంగ్రెస్‌కు నష్టం లేదు : డొక్కా


కిరణ్ రాజీనామాతో కాంగ్రెస్‌కు నష్టం లేదు : డొక్కా

Published at: 19-02-2014 18:51 PM
 New  0  0 
 
 

హైదరాబాద్, ఫిబ్రవరి 19: కిరణ్ కుమార్ రెడ్డి తన పదవులకు, పార్టీకి రాజీనామా చేసనందువల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లకుపైగా మంత్రిగా కొనసాగే అవకాశం తనకు ఇచ్చినందుకు కిరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలను ఎదుర్కొలేకే ఆయన పారిపోయారని డొక్కా ఎద్దేవా చేశారు.
కిరణ్ తీరు అసమర్ధుని జీవితయాత్రలా ఉందని, కాంగ్రెస్ వ్యక్తుల మీద ఆధారపడలేదని డొక్కా పేర్కొన్నారు. చిరంజీవి లాంటి ప్రజాదరణ కలిగిన నాయకులు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుస్తామని డొక్కా స్పష్టం చేశారు. ఈ సమయంలో కిరణ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టిన ఓరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
- See more at: http://www.andhrajyothy.com/node/67579#sthash.SDXAX48O.dpuf

No comments:

Post a Comment