Thursday 6 February 2014

చర్చపై రచ్చ!

చర్చపై రచ్చ!

Published at: 17-12-2013 03:09 AM
 New  0  0 
 
 

సభకు చేరిన విభజన బిల్లు
లోపల గోలగోల.. బయట బాహాబాహీ
పార్టీలకు అతీతంగా.. ప్రాంతాలుగా మమేకం..
గొడవ మధ్యే నోటిఫై చేసిన అసెంబ్లీ కార్యదర్శి..
సదారామ్‌కు టి-సభ్యుల రక్షణ కవచం
పోడియంలో మైకు విరిచేసిన రామచంద్రారెడ్డి..
తలపడిన టీఆర్ఎస్ నేత హరీశ్..
రణరంగంగా లాబీలు, మీడియా పాయింట్
చించేసి కాల్చేశారు
బిల్లు ప్రత్రులను కాల్చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు
చించిపారేసిన టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు
అడ్డుకున్న టీఆర్ఎస్, టీ-కాంగ్రెస్ నేతలు
మండలిలోనూ రభస.. నేటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు అసెంబ్లీకి చేరింది. అంతే... 'విభజన' మొదలైంది! పార్టీల్లేవ్... అన్నీ ప్రాంతాలే!
మాట్లాడుకోవడాల్లేవ్... కేకలు, అరుపులే! చర్చల్లేవ్... చించుకోవడం, నెట్టుకోవడాలే!
సభ లోపల పోడియం ముందు... సభ బయట మీడియా పాయింట్! సభలోపల స్పీకర్ కుర్చీ... బయట స్పీకర్ చాంబర్!
కాదేదీ కలహానికి అనర్హం! సభలో తమ స్థానాల్లో కూర్చోవాల్సిన వారు... వాటిపైకెక్కి నిల్చున్నారు. సభ బయట... అవే కుర్చీలను గాలిలోకెత్తారు.
లోపలా... బయటా పరస్పరం నెట్టుకున్నారు. కొట్టుకున్నంత పని చేశారు. ఆ పార్టీ, ఈ పార్టీ తేడా లేదు!
ప్రాంతాల వారీగా నిలువునా చీలిపోయిన గౌరవనీయులైన శాసనసభ్యులు... 'పెద్దలైన' శాసన మండలి సభ్యులు ఒకరిపైకొకరు మాటల కత్తులు దూసుకున్నారు.
విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టిన తొలి రోజే ఇదీ పరిస్థితి! ఇక... మంగళవారం నుంచి ఏమవుతుందో! సభా క్షేత్రంలో ఇంకేం చూడాల్సి వస్తుందో!
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
సభ కాదు... రభస! చర్చ కాదు... రచ్చ!!
మైకులు విరిగాయి.కాగితాలు చిరిగి ముక్కలయ్యాయి. సభాధ్యక్ష స్థానంపైకి వచ్చి పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ రణరంగాన్ని తలపించింది. అసెంబ్లీ లోపలా, బయటా 'విభజన' సెగ రగిలింది. పార్టీలను మరిచిపోయి...ప్రాంతాలవారీగా విడిపోయిన సభ్యులు హోరాహోరీ తలపడ్డారు. సభ్యుల 'రణ'గొణ ధ్వనుల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 సోమవారం శాసనసభలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభంకాగానే పా ర్టీలకు అతీతంగా... తెలంగాణ ప్రాంత సభ్యులు 'జై తెలంగాణ' అం టూ, సీమాంధ్ర సభ్యులు 'జై సమైక్యాంధ్ర' అంటూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యనే ఆయా పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
గందరగోళం, నిరసనలు ఆగలేదు. మొదలైన ఆరు ని మిషాల్లోనే వాయిదా పడింది. అయినా, ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు పోడియం నుంచి కదల్లేదు. దీంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల స మయంలో చేపట్టాల్సిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చినట్లే భా వించాలని ప్రకటించారు. ఆ వెంటనే 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013'తోపాటు రాష్ట్రపతి పంపించిన నోట్‌ను శాసన సభా కార్యదర్శి రాజా సదారాం చదువుతారని స్పీకర్ వెల్లడించారు. తెలంగాణ ప్రాంత సభ్యులంతా చుట్టూ రక్షణగా నిలవగా... రాజా సదా రాం ఆ నోట్‌ను చదివారు. ఆ తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్... విభజన బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. బిల్లు తెలుగు, ఉర్దూ ప్రతులను లాబీల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. బిల్లు ను సభలో ప్రవేశపెట్టడంతో సీమాంధ్ర సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. నినాదాల హోరు మరింత జోరందుకుంది. ఈ క్రమంలో 10.05 గంటల ప్రాంతంలో సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మధ్యాహ్నం రచ్చ రచ్చ
మధ్యాహ్నం 2.45 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. మొదలైన క్షణం నుంచే యుద్ధ వాతావరణాన్ని తలపించింది. టీఆర్ఎస్ సభ్యులు, వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ చాంబర్‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేలు ధర్నా నేపథ్యంలో, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభకు వచ్చారు. ఆయన పోడియంలోకి ప్రవేశిస్తుండగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ద్వారం తెరుచుకోకుండా అడ్డునిలిచారు. అక్కడే ఉన్న మార్షల్స్ వారిని పక్క కు తప్పించారు. ఆ తర్వాత అధ్యక్ష స్థానంలో డిప్యూటీ స్పీకర్ ఆసీనులయ్యారు. కాసేపటికి... వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పీకర్ పోడియంపై ఉన్న మైకును విరిచేశారు. పోడియాన్ని చుట్టుముట్టిన టీఆర్ఎస్, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేశకావేశాలకు లోనయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, వైసీపీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, తెల్లం బాలరాజు... టీఆర్ఎస్ సభ్యులు జూపల్లి కృష్ణారావు, సున్నం రాజయ్య కుర్చీలపైకి ఎక్కారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ముసాయిదా బిల్లును ముక్కలు ముక్కలుగా చించి అధ్యక్షస్థానంపైకి విసిరేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పోడియం వద్దకు వెళ్లారు. టీడీపీ సీమాం«ద్ర ఎమ్మెల్యేలు ప్ల కార్డులను చించేసి గాల్లోకి విసిరారు. మరోవైపు పోడియం వద్ద వైసీపీ, టీఆర్ఎస్ సభ్యుల మధ్య తోపులాట మొదలైంది. ఒకదశలో హరీశ్‌రావు, కాపు రామచంద్రారెడ్డి వాగ్వాదానికి దిగి ఒకరినొకరు నెట్టుకున్నారు. కాగితాలు డిప్యూటీ స్పీకర్‌పై పడకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రక్షణగా నిల్చున్నారు. సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని, సభకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మాట్లాడే అవకాశాన్నిచ్చారు. 'బిల్లుపై చర్చ చేపట్టాలి' అని శ్రీధర్ బాబు కోరారు. కానీ... అప్పటికే రగడ తారస్థాయికి చేరుకుంది. దీంతో చేసేదేమీ లేక సభను మంగళవారానికి డిప్యూటీ స్పీకర్ వాయిదా వేశారు. అయితే అంతకుముందు ఆయన విపక్ష నేత చంద్రబాబు పేరును పిలిచి...ఆ వెంటనే 'సారీ' అంటూ స భను వాయిదా వేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/43626#sthash.gqSf2Kfg.dpuf

No comments:

Post a Comment