Thursday 6 February 2014

బిల్లు తగలబెడతారా?

ఎంత అహంకారం.. బిల్లు తగలబెడతారా?

Published at: 17-12-2013 07:57 AM
 1  1  0 
 
 

సీమాంధ్ర ఎమ్మెల్యేలపై టీ మంత్రులు ఫైర్
15 రోజుల్లో కేంద్రానికి బిల్లు పంపాలి
జగన్‌కు చెప్పుదెబ్బలు తప్పవు: జానారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 16 : శాసనసభను మరో మూడు రోజులపాటు పొడిగించైనా బిల్లుపై చర్చను పూర్తి చేయాలని తెలంగాణ ప్రాంత మంత్రులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం జాప్యం జరిగినా రెండు ప్రాంతాల్లోనూ అపోహాలు, అనుమానాలు పెరిగి ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు. 15 రోజుల్లోగా బిల్లుపై అందరి అభిప్రాయాలను తీసుకుని కేంద్రానికి పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమకుమార్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు సోమవారం మీడియా పాయింట్లో విలేకర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అవగాహనరాహిత్యంతో కొంతమంది సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు సభలో వ్యవహరిస్తున్నారని మంత్రి జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని వైసీపీ లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్రం బిల్లును పంపిస్తే కొంతమంది వాటిని చింపివేయడం, తగలబెట్టడం వారి అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. దీనికి వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకరు తక్షణం బీఏసీ సమావేశం పెట్టి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతోనూ మాట్లాడి బిల్లుపై చర్చను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనుమానాలకు, అపోహలకు ఆస్కారం లేకుండా స్పీకరు శాసనసభ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన అన్నారు. వైసీపీది కాంగ్రెస్ డీఎన్ఏనని దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించిన తీరుపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగ్విజయ్‌ని చెంపదెబ్బ కొట్టాలన్న జగన్‌కి రాష్ట్రానికి నాయకత్వం వహించే అర్హత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ తీరును చూసి వైఎస్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. "ప్రజలు ఆవేశంలో ఆలోచించరు. కానీ, అవి తగ్గాక ఆయన నీతి నిజాయితీ, ప్రవర్తన అన్నిటిని చూస్తారు. అప్పుడు చెంపదెబ్బ కాదు, చెప్పు దెబ్బలు కొడతారు'' అని ఆయన తీవ్రంగా స్పందించారు. బిల్లుతోపాటు దిగ్విజయ్ ఢిల్లీ నుంచి డబ్బును తీసుకువచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ పై నుంచి కింది వరకు ప్రతి అంశాన్ని డబ్బుతో ముడిపెట్టడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎన్ని కోట్లు పెట్టి చంద్రబాబు ఎగదోస్తున్నారని తాము ప్రశ్నించాల్సి ఉంటుందని చెప్పారు.
- See more at: http://www.andhrajyothy.com/node/43878#sthash.QJPyZfPt.dpuf

No comments:

Post a Comment