కురియన్ తీరుపై మండిపడిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తీరుపై భారతీయ జనతాపార్టీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ బుధవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సొంత పార్టీ నేతలే నిరసనలు తెలుపుతుంటే సభ్యులు అదుపులోపెట్టుకోవాలని, లేని పక్షంలో సభను వాయిదా వేయాలని వారు సూచించారు. మంత్రులుగా ఉండి నిరసన వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయవచ్చునన్నారు. తాము సమైక్యాంధ్రకు వ్యతిరేకమని వెంకయ్య నాయుడు అన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అన్నారు. ఎపిలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావుల పైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. రాజ్యసభ జరుగుతున్నప్పుడు చిరు, కావూరి, ఇతర సీమాంధ్ర ఎంపీలు నిరసనలు తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని జై సమైక్యాంధ్ర అంటూ నిరసన తెలిపారు.
No comments:
Post a Comment