కిషోర్‌చంద్రదేవ్, పనబాక, చింతా మోహన్‌లను క్షమించం : అశోక్‌బాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: సమైక్య ఉద్యమానికి సహకరించని సీమాంధ్ర నేతలు కిషోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మీ, చింతా మోహన్‌లను క్షమించమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సోమవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో తలపెట్టిన మహాధర్నాకు ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె చేయని వ్యక్తులు ఎవరంటే ఆ ముగ్గురేనని అన్నారు. వీరు తప్ప సీమాంధ్రలో ఉన్న ఆరుకోట్ల మంది ప్రజలు సమ్మెలో పాల్గొన్నారని ఆయన అన్నారు. వాళ్లు నాయకులు అయినందుకు సిగ్గు పడుతున్నామని అశోక్‌బాబు పేర్కొన్నారు.
మనకు దమ్ముంటే ఢిల్లీ పీఠాన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉందని, ప్రధానమంత్రికి అర్హత ఉన్న వ్యక్తులు ఆంద్రప్రదేశ్‌లో ఉన్నారని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో బిల్లు విషయంలో బీజేపీ ప్రేక్షకపాత్ర వహిస్తే కాంగ్రెస్‌కు బీజేపీ తేడాలేదని ఆయన అన్నారు. విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క సమైక్యవాదికి ఉందని అకోశక్‌బాబు పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment