Sunday 2 February 2014

పార్లమెంట్‌లో చెడుగుడే

పార్లమెంట్‌లో చెడుగుడే

Published at: 03-02-2014 03:56 AM
 New  0  0 
 
 

సమావేశాలు జరగకుండా ఉడుంపట్టు
రేపటి నుంచి సీఎం మౌనదీక్ష
సరైన సమయంలో కోర్టుకు వెళతాం: లగడపాటి
రైలు రోకోలు చేయాలి.. ఢిల్లీని ముట్టడించాలి
సమైక్యాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం మేధో మథనంలో వక్తలు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 : "గతం నాస్తి. పార్టీల కతీతంగా నాయకులు చేయి చేయి కలిపి సమైక్యం కోసం పోరాడాలి. ఎంపీలపై ఒత్తిడి తేవాలి. ఢిల్లీని ముట్టడించి నిరసన దీక్షలు చేసి ఢిల్లీని గజగజలాడించాలి. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేసి రైళ్లను ఆపేయాలి. రైల్‌రోకోలకు విద్యార్థులు పట్టాల మీదకి రావాలి. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు తిరిగి రోడ్డెక్కాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వేడి పుట్టించాలి. ఉద్యమాన్ని ఉధృతం చేయాలి.'' అని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం నిర్వహించిన మేధోమథనంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం సోమాజిగూడలోని ఫోరం అధ్యక్షుడు ఎ. వల్లభాయి పటేల్ అధ్యక్షతన ఆదివారం సోమాజిగూడలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎంపీ కొనకళ్ల నారాయణ హాజరయ్యారు. సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ జేఏసీ నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ... ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద మంగళవారం నుంచి సీఎం కిరణ్ ధర్నా నిర్వహించనున్నారని చెప్పారు.
ఢిల్లీలో విభజన బిల్లు ముందుకు వెళ్లకుండా కట్టడి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ వివరాలను ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారని లగడపాటి చెప్పారు. ముఖ్యమంత్రే ధర్నా చేస్తున్నప్పుడు కేంద్ర మంత్రులు దిగి రావాల్సిందేనని ఆయన అన్నారు. బిల్లుపై రాష్ట్ర్రపతి న్యాయసలహా కోరుతున్నట్లు తమకు సమాచారం ఉందని లగడపాటి వెల్లడించారు. " మీ స్పీడ్‌ను బట్టే మా స్పీడ్ పెరుగుతుంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వేడి పుట్టించండి. బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వ స్తే చర్చ జరగకుండా ఉడుంపట్టు పడతాం. పార్లమెంట్‌లో చెడుగుడు ఆడతాం. సమైక్యాంధ్రను కోరుకునే వారంతా ఆఖరిపోరాటానికి సిద్ధంకండి'' అని లగడపాటి ప్రజలకు పిలుపు నిచ్చారు. 371(డి), రాజ్యాంగ ఉల్లంఘనలపై సరైన సమయంలో కోర్టుకు వెళతామని ఆయన చెప్పారు. లోపభూయిష్టంగా ఉన్న తెలంగాణ బిల్లును పార్లమెంట్‌కు పంపవద్దని రాష్ట్రపతిని కోరనున్నట్లు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ వెల్లడించారు. రాష్ట్రపతిని కలిసేందుకు తమ పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు కొనకళ్ల చెప్పారు. సదస్సులో తెలుగు ప్రజావేదిక అధ్యక్షుడు మిత్రా, సీమాంధ్ర గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీకృష్ణయ్య, వరలక్ష్మి, సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, టీడీపీ తరుపున దేవతోటి నాగరాజు, హైకోర్టు జేఏసీ అధ్యక్షుడు రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
బిల్లు సభలోకి రాగానే అవిశ్వాసం
తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని లగడపాటి అన్నారు. బిల్లు పార్లమెంట్‌కు చేరే విధానాన్ని ఆయన వివరించారు. బిల్లును ఆదివారం సాయంత్రానికి రాష్ట్రపతికి పంపిస్తారు. ఆ బిల్లును హోంశాఖ సీఎస్‌కు వెళుతుంది. అనంతరం దానిని హోం మంత్రికి పంపిస్తారు. హోంమంత్రి నుంచి బిల్లు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి తిరిగి రాష్ట్రపతికి చేరుతుంది. అసెంబ్లీ తిరస్కరించి పంపిన బిల్లును తప్పకుండా రాష్ట్రపతి చదువుతారు. తరువాత లీగల్ డిపార్ట్‌మెంట్‌కు పంపుతారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయానికి ఆ తర్వాత జీవోఎంకు పంపిస్తారు. అక్కడనుంచి హోంమంత్రి, ప్రధానమంత్రి కార్యాయానికిచేరి తిరిగి రాష్ట్ర పతికి చేరుతుంది. బిల్లు 2సార్లు రాష్ట్ర పతి వద్దకు వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి ఈ బిల్లు జాతి ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని భావించినప్పుడే దానిని పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. నాకు తెలిసి 14వ తేదీలోపు బిల్లు పార్లమెంట్‌లో పెట్టే అవకాశం లేదు. ఒక వేళ వస్తే 17వ తేదీకి పార్లమెంట్‌లో చర్చకు రావచ్చు. బిల్లు పార్లమెంట్‌లోకి రాగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానికి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/61317#sthash.RvV9OIpJ.dpuf

No comments:

Post a Comment