యుద్ధరంగంగా మారిన లోక్‌సభ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : ఓటాన్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో లోక్‌సభ యుద్ధరంగంగా మారింది. బుధవారం ఉదయం సభలో ఖర్గే ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో ఎంపీ శివప్రసాద్ పేపర్లు లాక్కునేందుకు యత్నించగా, తెలంగాణ ఎంపీలు ఖర్గేకు రక్షణగా నిలుచున్నారు. ఈ క్రమంలో ఎంపీలు శివప్రసాద్, మందా జగన్నాథం పరస్పర దాడులకు దిగారు.
ఈ క్రమంలో జేడీయూ నేత శరద్‌యాదవ్ ఇరు ప్రాంతాల ఎంపీలకు నచ్చజెప్పారు. మరోవైపు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా ఎదుటే ఎంపీలు లగడపాటి, హర్షకుమార్ హల్‌చల్ చేశారు. సోనియా వారించిన పట్టించుకోకుండా సీమాంధ్ర మంత్రులు వెల్‌లోకి చొచ్చుకెళ్లి నినాదాలు చేశారు. కాగా తెలంగాణ ఎంపీలు సోనియాకు రక్షణగా నిలిచారు. ఓవైపు ఖర్గే బడ్జెట్ ప్రసంగం చదువుతుండగా రైల్వే సహాయమంత్రి కోట్ల వెల్‌లో ఆందోళన చేపట్టారు.
లోక్‌సభలో తొలిసారి వెల్‌లోకి దూసుకెళ్లిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలిసారిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ఓటాన్ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలోనే కేంద్ర మంత్రులు కావూరి, పురంధేశ్వరి, పల్లంరాజు, చిరంజీవి వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలుపగా, కిల్లీకృపారాణి, కిషోర్‌చంద్రదేవ్ తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలియజేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : పార్లమెంటు ఆందోళనపై ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఓటాన్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో లోక్‌సభలో జరిగిన ఘటనతో కలత చెందినట్లు ప్రధాని తెలిపారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుందని ప్రధాని అన్నారు.
No comments:
Post a Comment