Thursday 6 February 2014

రెండే నిమిషాలు!

రెండే నిమిషాలు!

Published at: 19-12-2013 07:44 AM
 1  1  0 
 
 

శాసనసభ జరిగింది అంతే
పార్టీలకతీతంగా సమైక్య నినాదాలు
రెండుసార్లు వాయిదా
హైదరాబాద్, డిసెంబర్ 18 : రెండే నిమిషాలు! చాలా మంది సభ్యులు అప్పటికింకా సభలోకి రాలేదు. సభాపతి పూర్తిగా ఆశీనులైనా కాలేదు. నిమిషంలోనే సభ వాయిదా పడిం ది...తిరిగి ప్రారంభమైన కొన్ని సెకన్లకే రెం డోసారి.. మళ్లీ మొదలయినా, కనురెప్పపాటులోనే ముచ్చటగా మూడోసారి..వాయిదాల పర్వం సాగింది. ఉదయం సభ ప్రారంభానికి ముందే పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్, పోడియం వద్దకు చేరి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలంటూ టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, సమైక్యాంధ్ర తీర్మానం పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు నల్లబాడ్జీలు ధరించి సభకు వచ్చారు.
సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు నర్తిస్తున్న క్యారికేచర్‌ను ప్రదర్శించారు. సభ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారం భం అయిన వెంటనే.. టీడీపీ, వైసీపీ, సీపీఐ ఇచ్చిన వాయిదా తీర్మానా లను స్పీకర్ చదివి వినిపించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై టీ-టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం కోరగా, సమైక్యాంధ్ర తీర్మానం పెట్టాలంటూ వైసీపీ వాయిదా తీర్మానం కోరింది. బిల్లుపై వెంటనే చర్చించి రాష్ట్రపతికి పంపాల్సిందిగా సీపీఐ కోరింది. ఈ తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
ఇదే క్రమంలో పోడియం వద్ద సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగుతుండడంతో సభ ప్రారంభమైన నిమిషంపావుకే సభను వాయిదా వేశారు. తిరిగి సభ 10.15 గంటలకు ప్రారంభమైంది. అప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. సభను మరోసారి వాయిదా వేశారు. ఈ క్రమంలో రెండో సారి కేవలం 15 సెకన్ల పాటు సభ నడిచింది. మూడు గంటలకుపైగా విరామం తర్వాత మధ్యాహ్నం 1.26 గంటలకు సభ ప్రారంభమైంది. ఈ విరామ సమయంలో అటు సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఇటు తెలంగాణ ఎమ్మెల్యేలు సభలోనే ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించారు. ఒక దశలో..వారు పోడియం వద్దకు వెళ్లకుండా హరీశ్‌రావు అడ్డు నిలిచారు. "సీమాంధ్ర ఎమ్మెల్యేలూ సహకరించండి'' అంటూ టీఆర్ఎస్ సభ్యులు.. ప్రతిగా 'తెలంగాణ ఎమ్మెల్యేలూ ఆలోచించండి'' అంటూ సీమాంధ్ర సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసుకొన్నారు. హరీశ్, కమలాకర్‌లు..టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవులు, రామానాయుడులను చేతులమీదు ఎత్తుకెళ్లి సీట్లలో కూర్చోపెట్టారు.ఇంతలో సభ ప్రారంభమైంది. సభలోకి వచ్చిన సభాపతికి ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కాగితాలు చింపి గాలిలోకి ఎగురవేశారు. దీంతో ఆశీనులు అయిన వెంటనే సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/44609#sthash.nMHH8i0W.dpuf

No comments:

Post a Comment