మావో విగ్రహం కూల్చివేత
09-01-2016 03:11:42
- ప్రతిష్టకు అనుమతి లేదన్న చైనా
బీజింగ్, జనవరి 8: చైనాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పా టు చేసిన మావో జెడాంగ్ భారీ విగ్రహాన్ని అక్కడి ప్ర భుత్వం కూల్చి వేసింది. ఎలాంటి అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్టించారంటూ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది. చైనా కమ్యూనిస్టు యోధుడు, ఆ పార్టీ వ్యవస్థాపక ఛైర్మన్ అయిన మావో జెడాంగ్.. 37 మీటర్ల భారీ విగ్రహాన్ని.. హేనన్ ప్రాంతంలోని కైఫెంగ్ వద్ద ఇటీవల ప్రతిష్టించారు. హుందాగా కూర్చున్నట్టు ఉన్న ఈ భారీ విగ్రహాన్ని స్టీల్, సిమెంట్‌తో నిర్మించారు. దీనికి బంగారుపూత కూడా పూశారు. కాస్త ఎత్తైన ఖాళీ ప్రదేశంలో 37 మీటర్ల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడంతో.. ఆ ప్రాంతం, ఆ విగ్రహం ఆకర్షణీయంగా నిల్చా యి. 4.6 లక్షల డాలర్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. స్థానిక రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిధులు సమకూర్చారు. గత నెలలోనే విగ్రహ ప్రతిష్ట పూర్తైంది. విగ్రహం ఆకర్షణీయంగా ఉండడంతో.. సామాజిక మాథ్యమంలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా, ఇప్పుడు అనుమతి లేకుండా ప్రతిష్టించారంటూ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ విషయాన్ని పీపుల్స్ నెట్ న్యూస్ పోర్టల్ రిపోర్ట్ చేసింది. విగ్రహం కూల్చివేతపై మావో అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment