Wednesday, 27 January 2016

అమరావతికే నిధుల్లేవు...హైదరాబాద్‌కు ఏం తెస్తారు? : కేటీఆర్

అమరావతికే నిధుల్లేవు...హైదరాబాద్‌కు ఏం తెస్తారు? : కేటీఆర్
27-01-2016 13:41:38

హైదరాబాద్ : చంద్రబాబు, లోకేష్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు ఐటీ తెచ్చిన ఘనత తనదే అని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అమరావతికి కేంద్రం నుంచి నిధులు సాధించలేని లోకేష్ హైదరాబాద్‌కు ఏం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగులతో కేటీఆర్ భేటీ అయ్యారు.
 
విభజన వల్ల రెండు రాష్ట్రాలకు లాభం జరిగిందని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంగా ఉంటే మరో 25ఏళ్లయినా అభివృద్ధి పనులు జరిగేవి కావని ఆయన అన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు 7 ఉంటే... రాష్ట్ర సగటు 16శాతం ఉందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment