Friday, 29 January 2016

రాహుల్ అక్కడికి ఎందుకు వెళ్లలేదు'

రాహుల్ అక్కడికి ఎందుకు వెళ్లలేదు'

PTI | Updated: January 30, 2016 10:37 (IST)
'రాహుల్ అక్కడికి ఎందుకు వెళ్లలేదు'
హైదరాబాద్: దళిత పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండోసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి రావడం పై బీజేపీ మండిపడుతోంది. రోహిత్ ఆత్మహత్య సంఘటనను రాజకీయం చేయడానికి రాహుల్ మరోసారి హైదరాబాద్ వచ్చారని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి క్రిష్ణసాగర్ ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ దివాళాకోరుతననికి నిదర్శనమన్నారు. చెన్నైలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకొని వారం రోజులు గడిచినా ఎందుకు అక్కడికి వెళ్లలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే హెచ్ సీయూకి వచ్చారని ఆరోపించారు.

మరో వైపు శుక్రవారం అర్ధరాత్రి క్యాంపస్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ తల్లి రాధికను కలిసి పరామర్శించారు. వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో శనివారం దేశంలోని యూనివర్సిటీలన్నింటిలోనూ సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవుల నుంచి తొలగించాలని, హెచ్‌సీయూ వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.  
 

No comments:

Post a Comment