'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'
Sakshi | Updated: January 21, 2016 15:49 (IST)
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేంటో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయాక తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు.
వీసీ తప్పు చేయకుంటే దొంగతనంగా వచ్చి తమను కలిసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలని రాధిక ప్రశ్నించారు. తమ కుమారుడు రోహిత్ ఆశయసాధనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సస్పెన్షన్ కు గురైన మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గురువారం మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ మనస్తాపంతో ఆదివారం నాడు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

No comments:
Post a Comment