Wednesday, 27 January 2016

లోకం తెలియని లోకేశ్‌బాబు!

లోకం తెలియని లోకేశ్‌బాబు! 
28-01-2016 03:09:15

  •  ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు 
  •  సైకిల్‌ పంక్చర్‌ కావడంతో కారు ఎక్కుతున్నారు 
  •  త్వరలో మరింత మంది కారులో ప్రయాణం 
  •  మా కారులో కావలసినంత చోటుంది 
  •  లోకేశ్‌ పంపిస్తే మరింత మందిని ఎక్కిస్తాం 
  •  మతం పేరుతో ఓట్లడిగే వారిని బహిష్కరించాలి 
  •  బీఫ్‌ పేరుతో మజ్లిస్‌, బీజేపీ రాజకీయాలు 
  •  చంద్రబాబు జయభేరినే అభివృద్ధి చేశారు 
  •  ఎన్టీఆర్‌ రాక ముందే హైదరాబాద్‌ అభివృద్ధి 
  •  కులమతాలకు అతీతంగా కేసీఆర్‌ పాలన 
  •  అందుకే అన్ని పండుగలను గౌరవిస్తున్నారు 
  •  టీయూడబ్ల్యూజే మీట్‌ ది ప్రెస్‌లో కవిత 
హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సైకిల్‌ పంక్చర్‌ అవ్వడం వల్లే టీడీపీ నేతలు కారు ఎక్కుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. తమ కారులో చాలాచోటుందని, ఎక్కువ మంది కూర్చోవచ్చని ఆమె అన్నారు. త్వరలో నగరానికి చెందిన మరికొందరు టీడీపీ కీలక నేతలు కారులో ప్రయాణించబోతున్నారని చెప్పారు. లోకేశ్‌ పంపిస్తే మరింత మందిని హాయిగా కారులో ఎక్కించుకుంటామన్నారు. లోకం తెలియని లోకేశ్‌ బాబు ఏదేదో మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఆమె మాట్లాడారు. మతం పేరుతో ఓట్లు అడిగే రాజకీయ పార్టీలను బహిష్కరించాలని ప్రజలను ఆమె కోరారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ, టీడీపీలు మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ నగరం శాంతియుతంగా ఉండడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని అన్నారు. నగరంలో ఏదైనా సంఘటన జరిగితే బాగుండు అని ఆలోచిస్తున్న ఆ పార్టీ నేతలు.. దానిని ఓట్లుగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కులాలు, మతాలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు. అందుకే అన్ని పండగలను ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. చంద్రబాబు వల్లే హైటెక్‌సిటీ అభివృద్ధి చెందలేదని, ఆయన కేవలం జయభేరినే అభివృద్ధి చేశారని అన్నారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్‌ రాకముందే హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. చంద్రబాబు ప్రచారం చేసినా లాభం లేదని, ఆయన బయటి రాష్ట్రం వ్యక్తి అని అన్నారు. ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకునేందుకు కేసీఆర్‌ ఉన్నారని, అందుకే ప్రజలు టీఆర్‌ఎ్‌్‌సకే ఓటేస్తారని చెప్పారు. హైదరాబాద్‌ నగరానికి ప్యాకేజీ ఇస్తే లీకేజీ అవుతుందన్న వెంకయ్య వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కేంద్రం ప్యాకేజీలు ఇవ్వకున్నా తెలంగాణ మిగులు రాష్ట్రమని సొంతంగా అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. రాజ్యంగపరంగా రావాల్సిన నిధులను ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసన్నారు. నగరానికి ఆ పార్టీ చేసేందేమీలేదని, ఒక వేళ చేస్తే ఏం తెస్తారో కిషనరెడ్డి చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదన్నారు. ఎంఐఎం ప్రకటనలను ముస్లింలు నమ్మరన్నారు. మైనారిటీలు టీఆర్‌ఎ్‌సవైపే ఉన్నారన్నారు. ప్రజలు ఏం తినాలో కూడా నిర్ణయించాల్సింది పార్టీలు కాదని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఎవరేం తినాలన్నది వ్యక్తుల ఇష్టమని చెప్పారు. బీఫ్‌ పేరుతో బీజేపీ, మజ్లి్‌సలు రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. వైఎస్‌ కేబినెట్‌లో ఆరుగురు మహిళా మంత్రులున్నా.. మహిళల సంక్షేమం కోసం ఏం చేశారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. మేయర్‌ పదవిని మహిళలకు కేటాయించే విషయాన్ని సీఎం కేసీఆర్‌ నిర్ణయిస్తారని కవిత చెప్పారు. 

No comments:

Post a Comment