Wednesday, 27 January 2016

హైదరాబాద్‌కు నేను కాదు.. కేటీఆర్‌ అతిథి: లోకేష్‌

హైదరాబాద్‌కు నేను కాదు.. కేటీఆర్‌ అతిథి: లోకేష్‌
27-01-2016 17:36:44


హైదరాబాద్: ‘హైదరాబాద్‌కు నేను కాదు.. కేటీఆర్‌ అతిథి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యూసుఫ్‌గూడలో టీడీపీ అభ్యర్థి తరపున బుధవారం లోకేష్‌ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు తాను అతిథినంటూ వ్యాఖ్యానించిన మంత్రి కేటీఆర్‌‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని..నిక్కర్లు వేసుకుని గల్లీల్లో తిరిగానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేటీఆర్‌ గుంటూరులో చదివారన్నారు. ఏపీ అభివృద్ధి గురించి కేటీఆర్‌ తమకు చెప్పాల్సిన అవసరం లేదని లోకేశ్ సూచించారు. మేయర్‌ను గెలిపిస్తే ఏడాదిలోగా మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తామని..పూర్తి చేయకపోతే తనను నిలదీయండని ప్రజలకు చెప్పారు.

No comments:

Post a Comment