వర్మకు వంగవీటి రాధా వార్నింగ్
24-01-2016 20:14:06
వంగవీటి రంగా కథతో సినిమా తీస్తానన్న రామ్‌గోపాల్ వర్మ ప్రకటనపై రంగా కుమారుడు రాధా స్పందించారు. ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమాలో వాస్తవాన్ని చూపిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, అంతేతప్ప రంగా జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన కొడుకుగా తానెంత స్పందిస్తానో, రంగా అభిమానులు అంతకంటే ఎక్కువగా స్పందిస్తారని ఆయన చెప్పారు. వర్మ ఎటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారో అందరికీ తెలుసని అన్నారు.
ఏదో ఒక వర్గం వైపు వర్మ మొగ్గుచూపుతాడన్న సందేహాన్ని రాధా వ్యక్తం చేశారు. తమ ఇంటి పేరుతో ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీసి, అవాకులుచవాకులు పేలితే అభిమానులే తగిన బుద్ధి చెబుతారని రాధా తెలిపారు. అభిమానులు ఎలా స్పందించినా తనకెలాంటి బాధ్యత లేదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ తనను కానీ, తన కుటుంబ సభ్యులను కానీ వర్మ సంప్రదించలేదని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment