పేదరికాన్ని పారద్రోలడమే లక్ష్యం : చంద్రబాబు
12-01-2016 15:16:25
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌కు వరాలు అందించిన కేంద్రమంత్రి అనంతకుమార్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారద్రోలడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సంపద సృష్టించడమే కాదు, సంతోషదాయకమైన సమాజాన్ని రూపొందించేందుకు హ్యాపీనెస్ ఇండెక్స్‌ను తీసుకున్నామన్నారు.
ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ సన్‌రైజ్ స్టేట్‌గా వుండాలన్నదే తన లక్ష్యమని బాబు పేర్కొన్నారు. 3 రోజుల్లో 331 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, రూ.4,67,577 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. వీటివల్ల ఏపీలో 10లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.
No comments:
Post a Comment