ఏపీ రాజధానిలో ఎవరికీ అన్యాయం జరగనివ్వం: మంత్రి నారాయణ
29-01-2016 06:36:24
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో గ్రామకంఠాల నిర్ధారణలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని, కొందరికి భారీ లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో అలాంటిదేమీ జరిగినట్లు తమ దృష్టికి రాలేదని, ఒకవేళ అలా ఎక్కడన్నా జరిగి ఉంటే వాటిని సరి చేసి, రైతులందరికీ సమాన న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, సీఆర్‌డీఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.నారాయణ చెప్పారు. గురువారం సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాంశాలు ఆయన మాటల్లోనే..

- గ్రామకంఠాలను నిర్ధారించడంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసే ఉద్దేశ్యంతో ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. గుంటూరు జిల్లా జేసీ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో దీనిపై విస్తృత పరిశీలన, అధ్యయనం జరిపాం. ఇంత పకడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహించినప్పటికీ కొందరి పట్ల అధికారయంత్రాంగం అనుకూలంగా ప్రవర్తించిందని, ఫలితంగా అర్హులైన కొందరు రైతులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో మరోసారి గ్రామకంఠాల నిర్ధారణను సమీక్షించనున్నాం. ఇందుకోసం విస్తృతంగా చర్చించాం. వారు శుక్రవారం నుంచే రాజధాని ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లి, అక్కడి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అందరికీ ఆమోదయోగ్యంగా చర్యలు తీసుకుంటారు. ే మూడు రోజులపాటు సింగపూర్ వెళ్లి, అక్కడి సర్బానా సంస్థకు చెందిన నిపుణులకు క్యాపిటల్ సిటీ ముసాయిదా మాస్టర్‌ప్లానపై అందిన అభ్యంతరాలు, సూచనల్లో ప్రధానమైన అన్నింటినీ తెలిపాం. కొండవీటి వాగు లేదా పాలవాగు భవిష్యత్తులో ఎప్పటికీ ముంచెత్తలేని విధంగా మరింత పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ఆదేశించాం. ముఖ్యమంత్రి ఆదేశానుసారం కృష్ణానది కరకట్టను భారీఎత్తున విస్తరించి, రాజధాని ప్రాంతానికి మరొక ప్రధాన రహదారిగా ఉపయోగపడేలా చేయడంపైనా దృష్టి సారించాలన్నాం.
- రైతుల అభ్యంతరాలు, సూచనలపై ఇప్పటికే సింగపూర్ డిజైనర్లతో చర్చలు జరిపినప్పటికీ వాటిపై మరింత సమగ్రంగా సంప్రదింపులు జరిపేందుకుగాను మరింత సమయం ఇవ్వనున్నాం. సర్బానా నిపుణులు వచ్చే నెల 3- 5 తేదీల మధ్య సీఆర్డీయే ఉన్నతాధికారులతో మలివిడత చర్చలు జరుపుతారు. తర్వాతనే పలు ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఈ దృష్ట్యా గతంలో ప్రకటించిన విధంగా వచ్చే నెల 1వ తేదీన కాకుండా క్యాపిటల్ సిటీ ఫైనల్ మాస్టర్‌ప్లానను అదేనెల 15 ప్రాంతాల్లో విడుదల చేస్తాం. వెంటనే ల్యాండ్‌పూలింగ్ స్కీం నోటిఫికేషన్ ను ఇస్తాం.
- సీఆర్డీఏ పర్‌స్పెక్టివ్ ప్రణాళిక- 2050లో సూచించినవి కేవలం వ్యవసాయ (అగ్రికల్చరల్) జోన్లు మాత్రమే. అంతే తప్ప గ్రీన జోన్లు వేరు. గ్రీన జోన్లలో మాత్రమే అందులోని భూములను వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఉండదు.వ్యవసాయ జోన్లలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, నగరీకరణ ప్రయోజనాలకు భూములను తమ ఇష్టానుసారం రైతులు వినియోగించుకునే వీలుంటుంది.
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందినప్పటికీ ఉపాధి కల్పించడం లేదంటూ రాజధాని ప్రాంతంలోని 113 మంది యువతీ యువకులు ఆందోళన చెందుతున్నారు. వారికి గతంలోనే హామీ ఇచ్చినట్లుగా రాజధాని నిర్మాణంలో నిమగ్నం కానున్న ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తాం.
No comments:
Post a Comment