Thursday, 21 January 2016

కాల్ మనీ నిందితులకు బెయిల్ మంజూరు

Tuesday, 19 Jan, 5.22 pm
తాజావార్తలు
A A A

కాల్ మనీ నిందితులకు బెయిల్ మంజూరు

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులు ఎలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేష్ లకు మంగళవారం విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ కేంద్రంగా అధిక వడ్డీ రేట్లకు డబ్బులు అప్పుగా ఇవ్వడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనలపై నిందితులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
\


కాల్ మనీ షాక్: 4 లక్షలిచ్చి కోటి తీసుకున్నారు, ముగ్గురు నిందితులకు బెయిల్ Posted by: Srinivas Updated: Tuesday, January 19, 2016, 17:35 [IST] Give your rating: Share this on your social network:    FacebookTwitterGoogle+ Comments (0) Mail విజయవాడ: కాల్ మనీ రాకెట్ కుంభకోణంలో తవ్విన కొద్ది షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, మరో భాస్కర రావు అనే కాల్ మనీ వ్యాపారి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చి, రూ.కోటి ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భాస్కర రావు అనే వ్యక్తి ఓ వృద్ధ దంపతులకు నాలుగు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. దానికి వడ్డీతో సహా రూ.కోటి ఆస్తులు తీసుకున్నాడు. తుమ్మలపాలంలోని వృద్ధ దంపతుల భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్ మనీ నిందితులకు బెయిల్ కాల్ మనీ కేసులో మరికొంతమందికి మంగళవారం బెయిల్ లభించింది. యమలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేశ్‌లకు బెజవాడ రెండో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం షరతులలతో కూడిన బెయిల్ మంజూరు ఇచ్చింది. కొన్నిరోజుల కిందట తొమ్మిది మందికి బెయిల్ లభించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణును కస్టడీకి కోరుతూ విజయవాడ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కాగా ఆయన బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇంకా తీర్పు వెల్లడించలేదు.

Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/call-money-shockings-andhra-pradesh-171374.html

No comments:

Post a Comment