Sunday, 31 January 2016

కాపు గర్జనలో రెచ్చిపోయిన ఆందోళనకారులు..తుని పోలీస్ స్టేషన్‌కు నిప్పు

కాపు గర్జనలో రెచ్చిపోయిన ఆందోళనకారులు..తుని పోలీస్ స్టేషన్‌కు నిప్పు
31-01-2016 19:14:20

తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో మొదలైన కాపుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పంటించారు. ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉంది. 4పోలీస్ జీపులకు నిప్పుంటించారు. వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి..అంతేకాకుండా వారిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. రాళ్లదాడిలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. 

మీడియాకు సంబందించిన వ్యాన్లపై, కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేయటంతో పాటు కెమెరామెన్లను చితకబాదారు. దాడికి పాల్పడిన వారందరూ ముఖం కనపడకుండా మాస్క్‌లు ధరించినట్లు తెలుస్తోంది. చాలా పకడ్భందిగా పక్కా ప్లాన్‌తో రైలుపై, పోలీసు స్టేషన్‌పై దాడికి దిగి నిప్పంటించారు. ఇంకా ఆందోళన కొనసాగుతోంది. ఇదిలా ఉంటే విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన అన్ని రైళ్లను నిలిపివేశారు.తుని నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆందోళనకారులను చెదరగొట్టి..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ రోజు అర్థరాత్రికి ఆందోళన ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment