Friday, 8 January 2016

విష్ణుకు రిమాండ్‌.. హైడ్రామా!

విష్ణుకు రిమాండ్‌.. హైడ్రామా!
09-01-2016 01:48:24

  • ‘సిట్‌’కు చెమటలు పట్టించిన జడ్జి
  • 19 వరకు విష్ణు సోదరుల రిమాండ్‌
విజయవాడ లీగల్‌, జనవరి 8 : కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ అలియాస్‌ బుల్లయ్యలకు విజయవాడ కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ సమయంలో రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్‌ కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ‘‘విచారిస్తానని చెప్పారు. అరెస్టు చేశారు. రిమాండ్‌కు ఆదేశించే అధికారాలు నాకు లేవు’’ అని ఇంచార్జి జడ్జి తొలుత తేల్చిచెప్పడంతో సిట్‌ అధికారులకు చెమటలు పట్టాయి. కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణును రెండు రోజుల పాటు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్ లో విచారించిన సిట్‌ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. విష్ణుకు శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
 
అనంతరం రెండో అదనపు మెట్రోపాలిటన మేజిస్ర్టేట్‌ కోర్ట్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో ఆ కోర్టు న్యాయమూర్తి జువైనల్‌ కోర్టు విధుల్లో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్‌ కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రహీమ్‌కు రెండో ఏసీయంయం ఇనచార్జి జడ్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో సిట్‌ అధికారులు మల్లాది విష్ణు, మల్లాది శ్రీనివాస్‌లను న్యాయమూర్తి రహీమ్‌ ఎదుట హాజరు పరిచారు. ‘ నేను ఇన్‌చార్జి జడ్జిని మాత్రమే. విష్ణును రిమాండ్‌కు తీసుకోలేను’ అని న్యాయమూర్తి అనడంతో సిట్‌ అధికారులు విస్మయానికి గురి అయ్యారు. నిందితుడిని విచారిస్తామని చెప్పి.. ఇప్పుడు అరెస్టు చేసినందున.. తానేమీ నిర్ణయం తీసుకోలేనన్నారు. రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన మేజిస్ర్టేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని సూచించారు. ఆ న్యాయమూర్తి జువైనల్‌ కోర్టు వ్యవహారాలను చూస్తుండటంతో సిట్‌ అధికారులకు ఏమీ పాలు పోలేదు. దీంతో.. కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అనంతరం ఎట్టకేలకు కేసు విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి రహీమ్‌, మల్లాది సోదరులకు రిమాండ్‌ విధించారు.
 
కుట్రతోనే అరెస్టు: శైలజానాథ్‌ 
హైదరాబాద్‌: ప్రభుత్వ విధానాలను నిలదీస్తున్నందునే కుట్ర చేసి మరీ తమ పార్టీ నేత మల్లాది విష్ణును అరెస్టు చేశారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణును ఇరికించేందుకే సిట్‌ వేశారని అన్నారు.

No comments:

Post a Comment