Sunday 17 January 2016

ప్లాస్టిక్‌ ప్రాణాంతకం

ప్లాస్టిక్‌ ప్రాణాంతకం
17-01-2016 23:21:48











http://www.andhrajyothy.com/Artical?SID=196783

http://epaper.andhrajyothy.com/news?cat=andhra%20pradesh&day=20160118#2


  • ప్రమాదకారిగా ‘బిస్ఫినాల్‌-ఎ’
  • ప్లాస్టిక్‌ కవర్లు, కప్పుల్లో టీ, వేడి పదార్థాలతో పెను ముప్పు 
  • సోడా, వాటర్‌ బాటిళ్లునిజంగా ‘యూజ్‌ అండ్‌ త్రో’కే
  • మళ్లీమళ్లీ వాడితే ప్రమాదం.. వైద్య నిపుణుల హెచ్చరిక 
ఒకప్పుడు చక్కగా విస్తర్లలో భోజనం చేసేవారు. ఆ తర్వాత రకరకాల పళ్లేలు వచ్చాయి. స్టీలు, పింగాణి పాత్రలు వచ్చాయి. ఇప్పుడు అవీ క్రమంగా కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ ఉందంటే చాలు.. తినడానికి ప్లాస్టిక్‌ విస్తళ్లు, తాగడానికి ప్లాస్టిక్‌ కప్పులు వాడేస్తున్నాం. మామూలు సమయాల్లోనూ ఉదయం నిద్ర లేవగానే తాగే టీ, కాఫీ మొదలు.. టిఫిన్‌, భోజనం.. రాత్రి పడుకోబోయే ముందు తాగే నీళ్లు లేదా పాల వరకూ ప్లాస్టిక్‌ పాత్రలు, కప్పులే వాడుతున్నాం. ప్లాస్టిక్‌ను ఇలా విచ్చలవిడిగా వాడటం వల్ల కిడ్నీ వ్యాధుల నుంచి రకరకాల కేన్సర్ల దాకా వచ్చే ప్రమాదం ఉందని, వీటి వల్ల కలిగే ముప్పు గురించి ఎవరికీ అర్థం కావట్లేదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాటిలోని ‘బిస్ఫినాల్‌-ఎ’ అనే రసాయనం కేన్సర్‌ కారకమని హెచ్చరిస్తున్నారు. 

పార్శిల్‌ ప్యాకింగ్‌ ప్రమాదమే! 
పనిమీద ఎక్కడికో వెళ్తూ ఇంటికి తిరిగిళ్తుంటాం. ఇంటికెళ్లి ఇప్పుడేం వండుకుంటాంలే.. అనిపిస్తుంది. వెంటనే ఆ పక్కనో ఈ పక్కనో ఉన్న హోటల్‌కు వెళ్తాం. వేడివేడి చపాతీలో బటర్‌నాన్‌లో పార్శిల్‌ చేయిస్తాం. మరి నంచుకోవడానికి కూరో? దాన్నీ పల్చటి ప్లాస్టిక్‌ మగ్‌లాంటి దాంట్లో పార్శిల్‌ చేసిస్తారు. ఇదీ ప్రమాదమే. పదార్థాల్లో ఉండే వేడి వల్ల ప్లాస్టిక్‌ మెత్తబడి అందులోని రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. 

తల్లి గర్భంలోని శిశువులపైనా ప్రభావం! 
ప్లాస్టిక్స్‌లోని ప్రమాదకరమైన బీపీఏ.. తల్లి గర్భంలోని శిశువు మెదడు పెరుగుదలపైనా బీపీఏ ప్రభావం చూపుతోందని తేలింది. 2011లో జరిపిన ఓ పరిశోధన మేరకు.. బీపీఏ ఎక్కువ స్ధాయిలో ఉన్న గర్భిణీ సీ్త్రలకు అత్యధికంగా ఆడపిల్లలే జన్మించారు. ఆ శిశువుల్లో అతిక్రియాశీలత (హైపర్‌యాక్టివిటీ), అత్యుత్సాహం (యాంగ్జైటీ).. అలాగే తీవ్ర కుంగుబాటు (డిప్రెషన్‌) వంటివి కనిపించాయి. అదీ మూడేళ్ల వయస్సులోనే అలాంటి లక్షణాలు బయటపడ్డాయి. అయితే, ఈ రోజుల్లో పూరిస్థాయిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిరోధించడం సాధ్యం కాదు కాబట్టి.. వీలైనంత వరకు తగ్గించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు అహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగానికి దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. 

ప్లాస్టిక్‌ విస్తర్లతో ముప్పు 
వంట చేసుకోవడానికి బద్ధకంగా ఉంది. ఏం చేస్తాం? చలో కర్రీ పాయింట్‌! అప్పుడే వేడివేడిగా తెచ్చిపెట్టిన కూరలు, పప్పు, సాంబారు.. గిన్నెల్లో సర్దిపెట్టి ఉంటారక్కడ. సాంబారు వాసన ఘుమఘుమలాడిపోతుంటుంది. రెపరెపలాడే పల్చటి ప్లాస్టిక్‌ కవర్లలో వేడివేడి పప్పు, సాంబారు, కూరలను ప్యాక్‌ చేయిస్తాం. ‘వంట బాధ తప్పింది’ అనుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చి వాటిని ప్లాస్టిక్‌ విస్తళ్లలో పెట్టుకుని ఆరగిస్తాం. కానీ.. ఆ విస్తర్లపై పల్చటి ప్లాస్టిక్‌ పొర ఉంటుంది. వేడివేడి సాంబారో, పప్పో దాని మీద పడగానే అది కరిగి ఆహారంలోకి వస్తుంది. తస్మాత జాగ్రత్త. 

కవర్లలో టీ వద్దు! 
టీస్టాల్‌కు వెళ్తాం. గాజు గ్లాసులో టీ ఇస్తే తాగం. అంతకు ముందు అందులో ఎవరు తాగారోనన్న అనుమానం మనకి! అందుకే ఎంచక్కా డిస్పోజబుల్‌ కప్పులో ఇవ్వాలని అడుగుతాం. ఆ కప్పులో టీ తాగేసి.. స్నేహితుడి కోసం టీ పార్శిల్‌ చేసి ఇవ్వమంటాం. మరుగుతున్న గిన్నెలోంచి.. వేడివేడిగా పొగలు కక్కుతున్న టీని ప్లాస్టిక్‌ కవర్‌లో పోసి ఇస్తాడా టీస్టాల్‌ యజమాని. ఆ కవర్‌లో టీని తీసుకొచ్చి స్నేహితుడికి ఇస్తాం! అత్యంత పల్చగా ఉండే ఆ కవర్‌లోని రసాయనాలు టీలో కలిసి ఆరోగ్యానికి హాని చేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. 

కారులో బాటిల్‌ అనారోగ్య హేతువు
కారులో ఏదైనా ఊరు వెళ్లేటప్పుడు మధ్యలో ఆపి పల్చటి వాటర్‌ బాటిళ్లను కొంటాం. ఇంటికి వెళ్లాక ఆ బాటిల్‌ను మిగిలిన నీళ్లతో సహా కార్‌లోనే ఉంచేస్తాం. మళ్లీ తర్వాతెప్పుడో కారులో వెళ్లేటప్పుడు ఆ బాటిల్‌లోని నీళ్లనే తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ, పొరబాటున కూడా అలా చేయొద్దు. ఎందుకంటే.. కారు డోర్లన్నీ మూసేసి ఉంచడంతో లోపల విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడికి ప్లాస్టిక్‌ బాటిళ్లు మెత్తబడతాయి. ఈ సమయంలో వాటిలోని రసాయనాలు లోపల ఉన్న నీటిలో కరుగుతాయి. ఆ నీటిని తాగడమంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.
 
బిల్లులతో భద్రం
సూపర్‌ మార్కెట్‌లో వెళ్లి బిల్లు చెల్లించినప్పుడు.. లేదా డెబిట్‌ కార్డుతో ఏటీఎంలో డబ్బులు తీసినప్పుడు.. వచ్చే రసీదును చూసి జేబులో పెట్టుకుంటాం. కానీ.. ఆయా రసీదులపై బిస్ఫినాల్‌ ఏ పూత ఉంటుంది. ఆ పేపర్‌ను తయారుచేసేటప్పుడే ఇన్‌విజిబుల్‌ ఇంక్‌తో పాటు, దానిపై బీపీఏ లేదా బీపీఎస్‌ పూత పూస్తారు. ఏటీఎం/బిల్లింగ్‌ యంత్రం ఆ పేపర్‌పై కొంత ఒత్తిడితో వేడిని పుట్టించగానే బీపీఏ/బీపీఎస్‌ ఇన్‌విజిబుల్‌ ఇంక్‌తో చర్యపొంది రంగు మారి నల్లటి అక్షరాలు కనపడతాయి. వీటిని తరచుగా పట్టుకోవడం మంచిది కాదు. గర్భిణులు అయితే వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే.. ఎలుకలు, జీబ్రాఫి్‌షపై చేసిన పరిశోధనల్లో గర్భస్థ పిండాల మెదడు ఎదుగుదలపై బీపీఏ/బీపీఎస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు తేలింది. వీటివల్ల నేరుగానే కాదు పరోక్షంగానూ ప్రమాదం ఉంది. అదెలాగంటే.. ఈ పేపర్‌ రోల్స్‌ను రీసైకిల్‌ చేసి తయారుచేసే పేపర్‌ నేప్కిన్స్‌, టాయిలెట్‌ టిష్యూల్లోనూ బీపీఏ ప్రమాదకరస్థాయుల్లోనే ఉంటుంది.
రీసైక్లింగ్‌ నెంబర్లు.. వినియోగం!
రీసైక్లింగ్‌ నెంబరు 1
పాలీఎథిలీన్‌ టెరె్‌ఫటలాట్‌ (పీఈటీఈ లేదా పెట్‌) బాటిళ్లు. సాధారణంగా మనం వాడే సోడా, వాటర్‌ బాటిళ్లు ఈ కోవలోకి వస్తాయి. వీటిని ఒకసారి మాత్రమే వాడాలి. రెండోసారి వినియోగించొద్దు. 

రీసైక్లింగ్‌ నెంబరు 2
హైడెన్సిటీ పాలిఎథిలీన్‌ (హెచ్‌డీపీఈ). లోపలి వస్తువులు కనిపించకుండా ఉండే (అపారదర్శక) పాల జగ్గులు, డిటర్జెంట్‌ డబ్బాలు, జ్యూస్‌ బాటిళ్ళు, వెన్న డబ్బాలు, టాయిలెట్లలో ఉపయోగించే రసాయనాల బాటిళ్లు ఈ కోవలోకి వస్తాయి. వీటిని తిరిగి ఉపయోగించవచ్చు.

రీసైక్లింగ్‌ నెంబరు 3
పాలీవినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ). వంట నూనెల బాటిళ్లు. ప్లంబింగ్‌ పైపులు, రొట్టెల వంటి ఆహారాన్ని చుట్టబెట్టి ఉంచే షీట్‌ (ఫుడ్‌ ర్యాప్‌).. ఈ జాబితాలోకి వస్తాయి. ఆహార పదార్ధాల్లో వీలైనంత వరకు ఈ 3వ నెంబర్‌ సైక్లింగ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించాలి. ప్లాస్టిక్‌ ర్యాప్‌ పేపర్‌కు బదులుగా వ్యాక్స్‌ పేపర్‌ వాడడం మంచిది. 

రీసైక్లింగ్‌ నెంబరు 4
లో డెన్సిటీ పాలీఎథిలీన్‌ (ఎల్‌డీపీఈ). నిత్యావసర సరుకుల కోసం వినియోగించే సంచులు, కొన్ని రకాల ఆహార పదార్ధాల ప్యాక్‌ కోసం వాడే షీట్స్‌ (ఫుడ్‌ ర్యాప్స్‌), మెత్తగా ఉండే (స్క్వీజబుల్‌) బాటిళ్ళు, బ్రెడ్‌ కవర్లు, బ్యాగ్‌లు. స్టోరేజ్‌కు మళ్లీ వాడుకోవచ్చు. 

రీసైక్లింగ్‌ నెంబరు 5
పాలీప్రొపిలీన్‌. టానిక్కులు, సిరప్‌, కెచ్‌పలకు ఉపయోగించే బాటిళ్లు, మందంగా డిజైన్లతో తయారు చేసిన నీళ్ల బాటిళ్లు. తిరిగి వినియోగించవచ్చు.

రీసైక్లింగ్‌ నెంబరు 6
పాలీస్టెరైన్‌/స్టైరోఫోమ్‌. వాడి పారేసే ఫోమ్‌ ప్లేట్లు, కప్పులతో పాటు, ప్యాకింగ్‌ పదార్ధాల కోసం ఈ నెంబరు రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేస్తారు. ఉదాహరణకు.. హోటళ్ల నుండి మనం తెప్పించుకునే ప్యాకేజ్‌డ్‌ భోజనం. ప్లాస్టిక్‌ కంటెయినర్‌లో వేడి ఆహారాన్ని ఉంచి పార్సెల్‌ చేస్తారు. ఆ బాక్స్‌ను మళ్ళీ ఏ అవసరానికి వాడకూడదు. వీటిలో ఆహారం వండడం కానీ.. తిరిగి ఉపయోగించడం కానీ చేయవద్దు. ఎలాంటి ఆహార పదార్థాల నిల్వ కోసం కూడా వీటిని తిరిగి వాడకూడదు.

రీసైక్లింగ్‌ నెంబరు 7
పై కేటగిరిలలో లేని వాటితో పాటు, పై వాటిలో కొన్నింటిని జత చేస్తూ 7వ నెంబరు రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌ కేటగిరీ రూపొందించారు. కాంపాక్ట్‌ డిస్క్‌లు (సీడీలు), కంప్యూటర్‌ కేసులు, పిల్లల కోసం వాడే బాటిళతో పాటు, ‘బిస్ఫినాల్‌-ఎ’ (బీపీఏ) ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులు కూడాఈ కేటగిరీలో ఉన్నాయి. అయితే.. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి- పాలీ కార్బొనేట్‌(పీసీ), రెండు-పాలీ లాక్టైడ్‌ (పీఎల్‌ఏ). వీటిలో పీఎల్‌ఏ గుర్తు ఉన్నవి మొక్కజొన్న వంటివాటితో తయారు చేసినవి. నిపుణులు చెబుతున్నారు. ఏడో నంబరు పాలీకార్బొనేట్‌ ప్లాస్టిక్‌ వస్తువులను రీ సైకిల్‌ చేయడం కష్టం. 

ప్లాస్టిక్స్‌లోని ఇతర రసాయనాల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్‌ పాత్రల్లో వేడి వేడి ఆహార పదార్థాలను ఉంచకూడదు. చివరకు ఇడ్లీలను కూడా ఆ పాత్రల్లో పెట్టవద్దు.
  • వేడి వేడి ఆహార పదార్ధాలను ప్లాస్టిక్‌ పాత్రల్లో నిల్వ చేస్తే.. వాటి అవశే షాలు ఆహార పదార్ధాల్లో కలసిపోయే ప్రమాదం ఉంది.
  • గ్లాస్‌, పింగాణి, ఎనామిల్‌ పెయింట్‌ వేసిన మెటల్‌ లేదా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలు, పెనాలను మాత్రమే వంటకు, భోజనానికి వినియోగించాలి.
  • మంచినీళ్ళతో పాటు, రుచికరమైన పానీయాల (బెవరేజెస్‌) కోసం కూడా వీలైనంత వరకు గ్లాస్‌,
  • స్టెయిన్‌లెస్‌ పాత్రలు వాడాలి.
బిస్ఫినాల్‌-ఎ’ (బీపీఏ) అంటే ఏమిటి? 
బిస్ఫినాల్‌-ఎ (బీపీఏ) అనేది ఓ బలహీనమైన సింథటిక్‌ ఈస్ట్రోజెన్‌. ధృఢమైన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దంతాలను సరి చేసేందుకు ఉపయోగించే ప్లాస్టిక్‌ ఉపకరణాలు, ఆహార పదార్ధాలను కప్పి ఉంచేందుకు వాడే మెరుపు కాగితాల వంటి వాటిలో బీపీఏ ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్స్‌లోని ఇతర రసాయన పదార్థాల మాదిరిగానే బీపీఏ కూడా మానవ శరీరంలోని నిర్మాణ కణజాలానికి (హార్మోన్లకు) హాని కలిగిస్తుంది. ఈసో్ట్రజెన్లతో పాటు, శరీరంలోని ఇతర హార్మోన్లపై ప్రభావం చూపే బీపీఏ.. మహిళల్లో రొమ్ము కేన్సర్‌కు దారి తీస్తుందని గుర్తించారు. 

బిస్ఫినాల్‌-ఎ నుంచి తప్పించుకునేదెలా?
  • యూజ్‌ అండ్‌ త్రో.. బాగా అలవాటైన ఈ రోజుల్లో బయటకు వెళ్ళినప్పుడు డిస్పోజబుల్‌ గ్లాసులు తీసుకెళ్ళడం కామన్‌ అయింది. ఆ అలవాటుకు స్వస్తి చెప్పాలి.
  • పిక్నిక్‌లు, టూర్లకు వెళ్ళినప్పుడు ఇంట్లోని గ్లాసులు తీసుకెళ్ళడం మంచిది. వీలైనంత వరకు లోహ పాత్రలు మాత్రమే వాడాలి.
  • బయట కొన్న వాటర్‌ బాటిల్స్‌ను ఒక్కసారి మాత్రమే వాడి పారేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలో మళ్లీ మళ్లీ నీళ్లు నింపి వాడొద్దు.
  • ప్లాస్టిక్‌ క్యాన్లల్లో పెట్టి అమ్మే ఆహార వినియోగాన్ని తగ్గించాలి. అలాగే శిశువుల కోసం మార్కెట్లలో దొరికే ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ తగ్గించాలి.
  • పిల్లల కోసం వినియోగించే బాటిళ్లు.. ‘బీపీఏ ఫ్రీ’ లేబుల్‌ ఉంటేనే తీసుకోవాలి.
  • ప్లాస్టిక్‌ వస్తువులు, బాటిళ్ళ కింది భాగంలో ఉండే రీసైక్లింగ్‌ గుర్తు.. 7వ నెంబరును .జాగ్రత్తగా గమనించాలి. వాటిపై ‘‘పీఎల్‌ఏ’’ (పాలిమర్‌ పాలిలాక్టైడ్‌) అని స్పష్టంగా లేకపోయినా.. వాటిపై ఆకు గుర్తు లేకపోయినా.. ఆ ప్లాస్టిక్‌ వస్తువులో ‘బిస్ఫినాల్‌-ఎ’ (బీపీఏ) ఉందని అర్ధం. వాటిని అస్సలు వాడకూడదు.

No comments:

Post a Comment