Thursday 9 April 2015

కార్మికులపై కనికరం చూపించని ఖాకీలు

వేడుకున్నారు.. ఉరికించారు !

Sakshi | Updated: April 09, 2015 03:19 (IST)
♦ కార్మికులపై కనికరం చూపించని ఖాకీలు
♦ విచక్షణారహితంగా లాఠీచార్జి
♦ పలువురికి గాయూలు..అదుపులోకి 56 మంది..


ఏటూరునాగారం (మంగపేట) : ‘గతంలో కార్మికుల పక్షాన నాయకులు కలిశారు... ఈ సారి కార్మికులందరం ఉప ముఖ్యమంత్రి, స్థానిక మంత్రిని కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని విన్నవించుకుంటాం..’ అని పోలీసులను బిల్ట్ కార్మికులు వేడుకున్నారు. వారి మనసు కరగలేదు. ‘కమలాపురం నుంచి వచ్చినం..  మా కుటుంబాల దీనావస్థను తెలియజేస్తాం.. మాకు మంత్రులను కలిసే అవకాశం ఇవ్వాలి..’ అని  కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఖాకీలు ససేమిరా అంటే ససేమిరా అన్నారు. దీంతో కార్మికుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. అరుునా.. కార్మిక పెద్దలు సముదారుుస్తూ పోలీసులను బతిమిలాడారు. కేవలం ప్రతినిధులనే పంపిస్తాం... అని ఖాకీలు ఖరాకండిగా చెప్పారు.

ఈ క్రమం లో ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు అటుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ తన వాహనంలో వస్తున్నారు. అప్పటికే అసహనంతో ఉన్న కార్మికులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఇదే వారు చేసిన పొరపాటు కావొచ్చు. ఏటూరునాగారం, మంగపేట ఎస్సైలు వినయ్‌కుమార్, ముష్కం శ్రీనివాస్ స్పెషల్, సీఆర్‌పీఎఫ్, సివిల్ పోలీ సులు విరుచుకుపడ్డారు.. ఒక్కసారిగా లాఠీల కు పనిజెప్పారు.

కార్మికులు చెల్లాచెదురు కాగా.. పోలీసుల దెబ్బలతో పలువురికి గాయూలయ్యూరుు. ఈ క్రమంలో సీఐ కిశోర్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని కార్మికులను శాంతింప జేసేందుకు ప్రయత్నించారు. ‘మా సమస్యను చెప్పుకునేందుకు వస్తే అడ్డుకోవడమే కాకుండా...  లాఠీలతో కొడతారా అంటూ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో మరోసారి పోలీ సులు కార్మికులను చితక బాదారు. ఆ తర్వాత 56 మందికి పైగా కార్మికులను బలవంతంగా లారీలో ఎక్కించి మంగపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

No comments:

Post a Comment