Wednesday 15 April 2015

భారత్‌పై చైనా నిఘా!

భారత్‌పై చైనా నిఘా!

చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని ఫైర్ ఐ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఏపీటీ30 అనే సంస్థ ద్వారా చైనా ప్రభుత్వం కీలకమైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై నిఘా ఉంచిందని ఫైర్ ఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడటం ద్వారా ఏపీటీ 30 కీలకమైన సమాచారాన్ని సేకరించి చైనాకు అందజేస్తోందని పేర్కొంది. అయితే, నిఘా ఆరోపణలను చైనా ఖండించింది. భారత్ తో సహా ఆసియా దేశాలపై చైనా ఎలాంటి నిఘా కార్యకలాపాలకు పాల్పడటం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ప్రకటించారు.

పదేళ్లుగా భారత్‌, దక్షిణాసియా దేశాలపై చైనా గూఢచర్యం
 Posted by: Garrapalli Rajashekhar Published: Tuesday, April 14, 2015, 8:49 [IST] Share this on your social network:    FacebookTwitterGoogle+   CommentsMail న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందా? అంటే నిజమేనని పేర్కొంటోంది ఫైర్‌ ఐ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. ఏపిటి 30 అనే సంస్థ ద్వారా చైనా ప్రభుత్వం కీలకమైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై నిఘా ఉంచిందని ఫైర్‌ ఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడటం ద్వారా ఏపీటీ 30 కీలకమైన సమాచారాన్ని సేకరించి చైనాకు అందజేస్తోందని పేర్కొంది. భారత్ తోపాటు పలు ఆసియా దేశాలపైనా చైనా పదేళ్లుగా గూఢచర్యం జరుపుతున్నట్లు తెలిపింది. భారత్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, నేపాల్, సింగపూర్, ఇండోనేషియా లాంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని గూఢచర్యం సాగించినట్లు వెల్లడించింది. ఇది ఇలా ఉండగా, నిఘా ఆరోపణలను చైనా ఖండించింది. భారత్‌తో సహా ఆసియాన్‌ దేశాలపై చైనా ఎలాంటి నిఘా కార్యకలాపాలకు పాల్పడటం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ప్రకటించారు. కాగా, తమ దేశంపై గూఢచర్యం చేస్తున్న ఉపగ్రహాలను కనుగొన్నామని రష్యా ప్రకటించింది.

Read more at: http://telugu.oneindia.com/news/international/chinese-hackers-have-successfully-spied-on-southeast-asia-and-india-for-10-years-154283.html

Posted on: Thu 11 Sep 02:59:06.435572 2014
                     దేశాల మైత్రీ సంప్రదాయాల నిబంధనలను ఉల్లంఘిస్తూ భారత్‌, చైనాల రాజకీయ, సామాజిక, సాంకేతకాభివృద్ధి మొదలగు విషయాలపై ఓ కన్ను వేసి ఉంచింది. చైనా కదలికలను పరిశీలిస్తోందని చెప్పడానికి చైనా తదితర వర్ధమానదేశాలలో జరుగుతున్న సాంకేతిక, ఆర్ధిక ప్రగతి శీల విధానాలపై తరచు వ్యాఖ్యానించడమే నిదర్శనం. అయితే అమెరికా గూఢాచార శాఖ చైనా ఆర్ధిక పరమైన విషయాలపై బాగా దృష్టిపెట్టి రహస్య నివేదికలను తెప్పించుకుంటోందని చైనా ఆరోపిస్తోంది. ఎన్‌ఎస్‌ఏ వార్తా సంస్థ వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు మెయిల్‌ ద్వారా అమెరికా గూఢాచారి నివేదిక వివరాలు పంపడంతో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ దిశలో బ్రెజిల్‌లోని అతి పెద్ద చమురు సంస్థ పెట్రోబ్రాస్‌, చైనాలో నిర్వహించిన ఆర్ధిక సమావేశాలు, అక్కడా ఇంకా ఇతర దేశాలలో క్రెడిట్‌ కార్డు బ్యాకింగు పద్ధతులు, మైక్రోసాఫ్ట్‌ గూగుల్‌ ఐఎంఎఫ్‌ వంటి సంస్థల సహకారాలు మొదలగు అంశాలన్నిటిపైనా రహస్య పరిశీలన సాగుతోందని ఎన్‌ఎస్‌ఏ తెలిపింది. అయితే ఇదంతా ప్రపంచంలో జరుగుతున్న ఆర్దిక కార్యకలాపాల గురించి తెల్సుకోవడమే నని అమెరికా చెబుతున్నా గాని దానివల్ల అమెరికాకు వీసమెత్తు ఉపయోగం లేదని అదంతా చైనా ఏం చేస్తోందో తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతోందని ఎఎస్‌ఏ సంస్థ వెల్లడించింది.
                   అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుఎస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటిలిజెన్సు జేమ్స్‌ క్లాపర్‌ మాట్లాడుతూ విశ్వ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్ధిక నగదు లావాదేవీల సమాచారాన్ని తెల్సుకోవాలి వారు ఎలా నడుస్తున్నారో చూసి మన తరహాని నిర్ణయించుకోవాల్సిఉంది. ఇదంతా మన దేశంలో కంపెనీల ఎదుగుదలకోసం అవసరం అన్నారు. 2009లో క్లాపర్‌ ఆఫీసు నివేదికలు చూస్తే ఆయన చెప్పినట్లే ఉన్నాయి. అయితే ఆ నివేదికల ఆధారంగా తనకు ఏ ప్రమాదం రాకుండా చూసుకోవాలి గాని ఇతరుల రహస్యాలు తెలుసుకోవడం వలన దానికి అడ్డు కట్ట వేయాలనుకోవడం వలన ప్రయోజనం లేదని నిపుణులు అంటునారు. రాబోయే కాలంలో భారత్‌, రష్యా, చైనాలు శాస్త్ర సాంకేతిక రంగాలలో బాగా ఎదుగుతాయని ఇంటిలిజెన్సు నివేదిక చెబుతోంది. 2025నాటికి అమెరికాకు అభివృద్ధి కోణంలో ఈ దేశాలు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. టెక్నాలజీ, సమాచార వ్యవస్థ, ఇంధనం, విద్యుత్తు, మెడిసిన్‌, నానో టెక్నాలజీ రంగాలలో అమెరికాకు ఈ దేశాలు పెద్ద సవాలుగా పరిణమిస్తాయి. అని నివేదిక తెలియజెప్పింది.
                        దేశాల సాంకేతిక నిపుణతపైనా ఆయా దేశాల కలయికతో వచ్చే ఇబ్బందులపైనా కూడా నివేదికలో ప్రస్తావించారు.రాబోయే కాలంలో ఇండియా రష్యాలలో కంపెనీలు కలసి టెక్నాలజీ ప్రగతిలో కొత్త బాటలు వేస్తాయని వివరించారు. నివేదికలో ప్రస్తుతం వివిధ రంగాలలో యుఎస్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పోల్చి చైనా భారత్‌ వంటి దేశాలలో కంపెనీలు చేస్తున్న పనులను గ్రాఫిక్కులు, చిత్రాల ద్వారా వివరించారు. ఇంకా పది 20ఏళ్ల కాలంలో ఈ పోటీ ఏర్పడుతోంది కనుక ఇప్పటినుంచే తగిన ప్రణాళకలు వేసుకుని ఇబ్బందులను అధిగమించవచ్చని నివేదికలో డిఎన్‌ఐ తన దేశానికి వివరించింది. ఇతర దేశాల రహస్యాలపై భారీ ఎత్తున నిఘా ఉంచుతున్న అమెరికా ఇతర దేశాలపై అదే తరహా ఆరోపణలు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ తరహా ఆరోపణలతోనే చైనాకు చెందిన కొందరు సిబ్బందిని బహిష్కరించింది. ఆమర్నాడే న్యూయార్కు టైమ్స్‌ పత్రికలో జస్టిస్‌ డిపార్టుమెంటుకు చెందిన మాజీ అదికారి గోల్డు స్మిత్‌తో పాటు ఇతర అధికారులు అమెరికా తన ప్రయోజనాల కోసం గూఢాచార్యం చేస్తోందని తెలిపారు. అదే సమయంలో కొన్ని ఇతర దేశాలుకూడా ఆ తరహా చర్యలు చేస్తున్నాయని చెప్పారు. కొన్ని దేశాలు ఇతరుల సమాచారాన్ని సేకరించడంలో కొత్తదనాలు తెలుసుకోవడానికి కావచ్చేమోకానీ అమెరికా మాత్రం ఇది ఎదుటి వారి బలహీనతలను తెలుసుకుని వారిపై ఆధిపత్యం చెలాయించే పనిలో భాగమేనని చెప్పవచ్చు. అమెరికా నేటి సాంకేతిక వెసులుబాటు లేని రోజుల్లో కూడా సోషలిస్టు దేశాలపై వేగులను పంపి నిఘావేయడం జగమెరిగిన సత్యం.

No comments:

Post a Comment