Wednesday 15 April 2015

ఆరు జనతాపార్టీల విలీనం నేడే

ఆరు జనతాపార్టీల విలీనం నేడే
Others | Updated: April 15, 2015 12:19 (IST)
ఢిల్లీ: ఎస్పీ అధినేత ములాయం సింగ్ నేతృత్వంలో జనతా పరివార్ కు చెందిన ఆరు పార్టీల విలీనం బుధవారం జరగనుంది. ములాయం నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌జేటీ, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఐన్‌ఎల్‌డీ పార్టీల భేటీ జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శరద్ యాదవ్, కేసీ త్యాగి, హెచ్ డి దేవెగౌడ, లాలూ ప్రసాద్, కమల్ మొరార్క, దుష్యంత్ చౌతాల,రాంగోపాల్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్త కూటమి పేరు, గుర్తును ఖారారు చేసే అవకాశం ఉంది. కొత్త పార్టీకి సమాజ్‌వాదీ జనతా పార్టీ లేదా సమాజ్‌వాదీ జనతాదళ్ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నూతన పార్టీకి సైకిల్ గుర్తును నిర్ధారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment