Monday 13 April 2015

చిత్తూరు: అజ్ఞాతంలో ఉన్న వైసీపీ నేత అరెస్ట్‌

చిత్తూరు: అజ్ఞాతంలో ఉన్న వైసీపీ నేత అరెస్ట్‌
చిత్తూరు, (ఏప్రిల్ 13):అజ్ఞాతంలో ఉన్న వైసీపీ నేత, చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలీని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఎంపీపీ మస్తాన్ వలీ  గతంలో ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి  పీడీ యాక్ట్ నమోదు చేశారు. అరెస్టైన మస్తాన్ వలీ బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. అజ్ఞాతంలో ఉన్న వైసీపీ నేతను పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment