Tuesday 14 April 2015

పదేళ్లుగా భారత్‌పై చైనా గూఢచర్యం!

పదేళ్లుగా భారత్‌పై చైనా గూఢచర్యం!
సింగపూర్‌, ఏప్రిల్‌ 13: చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందా? ఫైర్‌ ఐ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఔననే అంటోంది. ఏపీటీ30 అనే సంస్థ ద్వారా చైనా ప్రభుత్వం కీలకమైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై నిఘా ఉంచిందని ఫైర్‌ ఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడటం ద్వారా ఏపీటీ 30 కీలకమైన సమాచారాన్ని సేకరించి చైనాకు అందజేస్తోందని పేర్కొంది. అయితే, నిఘా ఆరోపణలను చైనా ఖండించింది. భారత్‌తోసహా ఆసియాన్‌ దేశాలపై చైనా ఎలాంటి నిఘా కార్యకలాపాలకు పాల్పడటం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ప్రకటించారు. ఇదిలా ఉండగా తమ దేశంపై గూఢచర్యం చేస్తున్న ఉపగ్రహాలను కనుగొన్నామని రష్యా ప్రకటించింది.

No comments:

Post a Comment