Friday 10 April 2015

ఏపీలో రుణమాఫీ పరిష్కారానికి ప్రత్యేక సెల్

April 6, 2015 - 18:53

హైదరాబాద్: ఏపీలో రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించిన రైతులు సచివాలయానికి పోటెత్తారు. వారి అభ్యంతరాలను స్వీకరించేందుకు సెక్రటేరియట్‌లో గ్రివియెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. రెండో దశ రుణమాఫీలో అనర్హుల వివరాలు సరిచూస్తున్నామన్నారు ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు. అర్హులైన అందరికీ రుణమాఫీ అమలు చేస్తామన్నారు. అభ్యంతరాలు తొలగిపోయిన 2 వారాల్లో డబ్బులు జమచేస్తామన్నారు. ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసుకునే 



రుణ మాఫీ ఏమైంది?

  • 07/04/2015
హైదరాబాద్, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రుణమాఫీ సెగ తగిలింది. రుణమాఫీ అమలుకాని రైతులు భారీ సంఖ్యలో సోమవారం సచివాలయానికి చేరుకుని తమ రుణ మాఫీ సంగతి ఏమిటి అంటూ అధికారులను నిలదీశారు. తమ పేర్లు లిస్టుల్లో లేకుండా చేశారని వారు పేర్కొన్నారు. ఒక దశలో వారికి సమాధానం చెప్పేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోగా తర్వాత వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు, ప్రణాళికా మండలి అధికారులు వారికి నచ్చచెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తాము వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. తాము దిగువ స్థాయి అధికారులకు, తహసీల్దార్లకు ఎంతగా విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొన్నారు. తొలి దశ రైతు రుణ విమోచన కార్యక్రమం ముగియడం, రెండో దశలో కూడా తమ విజ్ఞప్తుల గడువు ముగియడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. చివరికి ప్రభుత్వం వారి ఇబ్బందులు వినేందుకు ప్రత్యేక కౌంటర్ ప్రారంభించడంతో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఇబ్బందులను చెప్పారు. చాలా మంది రైతుల పేర్లు అనర్హుల జాబితాలో చేర్చారని ఇది చాలా అన్యాయమని అన్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం నుండి వచ్చిన ఒక రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకర్ల వద్దకు వెళ్తే తమకేమీ తెలియదని అంటున్నారని, అధికారుల వద్దకు వెళ్తే బ్యాంకులకు వెళ్లమని చెబుతున్నారని వారు పేర్కొన్నారు.
ప్రత్యేక సెల్ ఏర్పాటు
రుణ మాఫీ సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్ వ్యవసాయ కమిషనరేట్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్టు ఎపి ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఆధార్ సంఖ్యను జోడించి ఈ-మెయిల్‌కు ఫిర్యాదులు పంపించవచ్చని ఆయన అన్నారు.


No comments:

Post a Comment