Saturday 18 April 2015

లేటు వయసులో ఘాటు యవ్వనం

లేటు వయసులో ఘాటు యవ్వనం

ఇటీవల తమ అధ్యక్షుడిని టీవీ తెరపై చూసిన రష్యన్లు మరోసారి అవాక్కయ్యారు.. 62 ఏళ్ల పుతిన్‌.. వయసు పెరుగుతున్న కొద్దీ నవయువకుడిలా మారిపోతుండడమే దానికి కారణం. వృద్ధాప్యంలో చర్మం సాగి ముడుతలు పడడం సహజం.. అయితే.. ఆ మాట ఎవరి విషయంలోనైనా ఒప్పుకుంటాం కానీ మా అధ్యక్షుడు మాత్రం దానికతీతమని వాదించేందుకూ రష్యన్లు సిద్ధపడుతున్నారు. పైగా గతంలో ఉన్న ముడతలనూ వదిలించుకొని మరీ వెలిగిపోతున్నాడని చెబుతున్నారు. అవును అదీ నిజమే! ఇటీవల ఆయనను చూసిన వారెవరైనా పది పదిహేనేళ్లనాటి పుతిన్‌కు నేటి ఆయన రూపానికి చాలా మార్పులు వచ్చాయని ఒప్పుకుంటారు. అంతెందుకు రెండేళ్ల క్రితం ఫొటోలను చూస్తే పుతిన్‌ కళ్లకింది ముడుతలను గమనించవచ్చు. తాజా చిత్రాలలో మాత్రం పుతిన్‌ ముఖం వెలిగిపోతోంది. ఆయన కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకున్నారనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది. గత నెలలో ఆయన పదిరోజుల పాటు ‘సెలవు’లో ఉన్నారు. ఆ సెలవు ఈ సర్జరీ కోసమేనని సమాచారం.

No comments:

Post a Comment